అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు గాలులు వీస్తున్నాయి. కేరళలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈనెల 18 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. దీంతో గుజరాత్ లోని…
ఓవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు.. తుఫాన్… కేరళను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చడంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం,…