రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చందాపుర హెడ్మాస్టర్ లేఔట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కుళ్లిన స్థితితో ఉన్న యువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి మరణించిన ఇంట్లో ఒడిశాకు చెందిన సపన్ కుమార్ (40) ఉండేవాడని పోలీసులు…
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు.
స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాం సాగర్ కాల్వలో పడి గల్లంతైన ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం చోటుచేసుకుంది. వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించారు.
Uttar Pradesh: సోదరి కులాంతర వివాహం చేసుకుందని పగ పెంచుకున్న వ్యక్తి, ఆమె భర్తను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బిజ్నోర్లోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరాపూర్ ఖాదర్ గ్రామంలో నిన్న రాత్రి హత్య జరిగింది. బాధితుడిని చాంద్పూర్లో నివాసం ఉంటున్న బ్రజేష్ సింగ్గా గుర్తించారు.
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29)ని అతని తండ్రి రంగ్లాల్(54) దారుణంగా హత్య చేశాడు. గౌరవ్ పెళ్లికి కొన్ని గంటల ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులకు విస్తూపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంత వరకు కొడుకు తిడుతున్నాడనే కోపంతోనే గౌరవ్ని హత్య చేశాడని భావిస్తున్నప్పటికీ, మరో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య తనను విడిచిపెట్టిందనే కోపంతోనే కొడుకును పెళ్లి రోజే చంపినట్లు రంగలాల్ పోలీసులకు వెల్లడించారు. ఈ హత్యకు మూడు…
Woman strangled to death in Telangana: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో మల్లవ్వ (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతు కోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మల్లవ్వ గొంతు కోసి అతికిరాతంగా చంపేశారు. గొంతు కోయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మల్లవ్వ చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులు లేకపోవడంతో దుండగుల పని ఈజీ అయింది. Also Read: IND…
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29) హత్య సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ్ సింఘాల్ని అతని తంండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజూ తిడుతుండే వాడనే కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో గౌరవ్ అతడి…
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్నగర్లో చోటుచేసుకుంది.