నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్‌లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది.
డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
Man stabs wife: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైందని ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా పొడిచి చంపాడు. 30 ఏళ్ల పరస్రామ్,28 ఏళ్ల తన భార్య ప్రేమాదేవీని చంపేశాడు. రాష్ట్రంలోని సీతాపూర్‌లో థాంగావ్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కొత్వలన్పూర్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కర్ణాటకలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన పర్సులోని రూ.2 వేలు దొంగిలించిందని టీచర్ అనుమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే బాలిక ఈ దారుణానికి ఒడిగట్టిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Live-In Partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న వారు తమ భాగస్వాములను కిరాకతంగా హత్య చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుగ్రామ్ సమీపంలోని చౌమా గ్రామంలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో మహిళ శవమై కనిపించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో లలన్ యాదవ్(35) అనే నిందితుడు మద్యం మత్తులో మహిళను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు…
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దళిత మహిళను పెళ్లి చేసుకునేందుకు తన గుర్తింపును దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ ఆలం అనే నిందితుడు తన పేరును ఆర్యన్ ప్రసాద్‌గా మార్చుకుని గోరఖ్‌పూర్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఆ మహిళకు అబద్ధం చెప్పాడు.
Couple Arrested: బడా వ్యాపారవేత్తగా బిల్డప్ ఇస్తూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా పెళ్లికి యత్నిస్తున్న ఘరానా జంటను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.