విజయనగరం జిల్లా బొబ్బిలి గున్నతోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజుగా గుర్తించారు.
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది.
Crime: ఆన్లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు.
కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. కేంద్రంలోనీ అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ బాండ్ పేరుతో మోసం చేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్‌తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. కాగా.. డాక్టర్ కైలాష్ రాఠీగా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు నాసిక్ పంచవటిలోని సుయోగ్ హాస్పిటల్లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.