Diamond Jewellery: జూబ్లీహిల్స్ లో కోటి వజ్రాభరణాలు చోరీ.. ట్యాక్సీ డ్రైవర్ పై అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diamond Jewellery: జూబ్లీహిల్స్‌లో రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–71లోని నవనిర్మాణ్ నగర్‌లో నివసించే బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్ ఉద్యోగి తన భార్య శీలతో కలిసి ఈ నెల 20న బెంగుళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. అక్కడ ట్యాక్సీ మాట్లాడుకుని నవనిర్మాణ్ నగర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫిలింఛాంబర్ ఎదురుగా విజేత సూపర్ మార్కెట్ వద్ద ట్యాక్సీ డ్రైవర్ కారును ఆపి శుభ్రం చేసుకున్నాడు. కొద్దిసేపటికి వారిద్దరినీ ఇంటి వద్ద దింపడమే కాకుండా కారు డిక్కీలో ఉన్న రెండు సూట్‌కేసులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.
Read also: Mrunal Thakur : ఆ సీన్ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది..
Also Read
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
కాగా.. ఈ నెల 24న సాయంత్రం బాబ్జీ సూట్ కేసుల్లో ఉన్న ఆభరణాలను భద్రపరిచేందుకు చూడగా అందులో ఉండాల్సిన జ్యువెలరీ బాక్స్ కనిపించలేదు. ఆ జ్యువెలరీ బాక్స్‌లో మూడు డైమండ్ నెక్లెస్‌లు, మూడు జతల డైమండ్ చెవి రింగులు ఉన్నాయని, వీటి విలువ రూ.కోటి ఉంటుందని ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం ఉందని, కారును ఆపినప్పుడు డిక్కీలో నుంచి వాటిని తీసి ఉంటాడని, లేదా ఇంట్లోకి సూట్‌కేసులు తెచ్చే క్రమంలో జ్యువెలరీ బాక్స్‌ను చోరీ చేసి ఉండవచ్చునని తెలిపాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సమయంలో ట్యాక్సీ ఎవరు బుక్ చేశారు, దాని నెంబర్ తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Oppo K12 Launch: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. ధర?
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!