Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్‌ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా…
తూప్రాన్‌లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
బెంగళూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం…
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు.
Man Kills Wife: ఢిల్లీలో దారుణం జరిగింది. 55 ఏళ్ల వ్యక్తి భార్యను హత్య చేసి, నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో జరిగింది. ఇంట్లో నుంచి భరించలేదని దుర్వాసన రావడంతో నిందితుడు భరత్ సింగ్ ఇంటి ముందు కూర్చుని తన భార్యను చంపినట్లు కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన పొరుగింటి వారితో తన భార్యను చంపేశానని, పోలీసులను పిలవాలని నిందితుడు కోరాడు.
పొటోషూట్ పేరుతో రప్పించి కెమెరాల ఓ యువ ఫొటోగ్రాఫర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.