మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన శివపురిలోని జవహర్ కాలనీలో జరిగింది. తాను చెప్పిన మాట విననందుకు కన్న కొడుకుపై కర్కశం చూపించాడు. కూలర్ ను శుభ్రం చేయమని చెప్పిన తండ్రి.. కుమారుడు మాట వినకపోవడంతో కోపంతో కర్రలతో కొట్టాడు. అంతటితో ఆగకుండా.. తండ్రి కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన తన కొడుకును రక్షించబోయిన తల్లిని, మరో కుమారుడిని కూడా చితక బాదాడు.
Nagpur: మహారాష్ట్ర నాగ్పూర్లో దారుణం జరిగింది. ఫోన్లో గట్టిగా మాట్లాడోద్దని సూచించినందుకు ఏకంగా ఓ తండ్రి కొడుకును కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాడ్తో దాడి చేయడంతో అతని కొడుకు మరణించాడు. ఈ ఘటన నాగ్పూర్ జిల్లాలో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్రా గ్రామంలో జరిగింది. నిందితుడు రాంరావు కక్డేని పోలీసులు అరెస్ట్ చేశారు.
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read:…
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది.…
Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
Crime: ఉద్యోగం చూసుకోవాలని తండ్రి కోరడమే పాపమైంది. కొడుకు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని నారిసింగ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం చూసుకోవాలని ఒత్తిడి చేయడంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న రాకేష్ ఠాకూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ కాలనీలో శవమై కనిపించాడు. అతని కొడుకు సుధాన్షు ఠాకూరు అతడిని హత్య చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు…