Karnataka: భార్య ఎదుటే మహిళపై అత్యాచారం.. మతం మార్చుకోవాలని బ్లాక్‌మెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తన అసభ్యకరమైన ఫోటోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, బలవంతంగా మతమార్పిడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. అతని భార్య ముందే తనపై అత్యాచారం చేశాడని, బుర్ఖా ధరించి నుదుటిపై కుంకుమ ధరించకుండా చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
రఫిక్ అనే నిందితుడు 28 ఏళ్ల మహిళను లోబరుచుకుని, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారాలని, తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. రఫిక్, అతని భార్య సదరు బాధిత మహిళను బెలగావిలోని తమ ఇంట్లోకి మార్చారు, వారు చెప్పిదానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారని పోలీసులు వెల్లడించారు. రఫిక్ తన భార్య ఎదుటే తమపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించినట్లు బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేడ తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నిందితులు తనను బొట్టు పెట్టుకోవద్దని, బుర్ఖా ధరించి రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని బలవంతం చేసినట్లు, తనపై కులం ఆధారంగా దూషణలు చేశారని, తక్కువ కులానికి చెందినందున వేరే మతంలోకి మారాలని నిందితులు బలవంతం చేశారని మహిళ ఆరోపించింది. తన భర్తకు విడాకులు ఇవ్వాలని రఫిక్ కోరాడని, తన డిమాండ్లు అంగీకరించకుంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని బెదిరించినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకోకుంటే చంపేస్తామని నిందితులైన జంట బెదిరించినట్లు తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!