US-Iran Tension: ఇరాన్ సమీపంలో F-35, F-16 జెట్‌లు.. అమెరికా ఏం ప్లాన్ చేస్తోంది.?
- ఇరాన్ సమీపంలో F-35, F-16 జెట్‌లు..
- ఓ వైపు చర్చలు, మరోవైపు ఉద్రిక్తతలు..
- సైన్యాన్ని మోహరిస్తున్న అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Tension: ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అధికారులు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటికీ, అమెరికా మాత్రం ఇరాన్ సమీపంలో సైన్యాన్ని మోహరిస్తూనే ఉంది. F-35లు, F-22లు, F-16లు సహా 50కి పైగా US ఫైటర్ జెట్‌లు గత 24 గంటల్లో పశ్చిమాసియాకు తరలించారు. మంగళవారం జెనీవాలో ఇరాన్, యూఎస్ అణుచర్చల్లో పురోగతి ఉందని యూఎస్ అధికారులు చెప్పారు. అయినప్పటికీ, ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇలా సైనిక మోహరింపులు చేపట్టినట్లు భావిస్తున్నారు.
Read Also: Kiren Rijiju: రాహుల్ గాంధీ దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం..
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
జనవరిలో ఇరాన్ వ్యాప్తంగా సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వీటిని ఇరాన్ క్రూరంగా అణిచివేసింది. అప్పటి నుంచి ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జనవరి చివర్లో ట్రంప్ విమాన వాహక నౌక్ USS అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలోకి పంపాడు. తరువాత, ఫిబ్రవరి మొదటి వారంలో, ఒక డజను F-15 ఫైటర్ జెట్‌లు, ఒక MQ-9 రీపర్ కంబాట్ డ్రోన్ మరియు అనేక A-10C థండర్‌బోల్ట్ II గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా జోర్డాన్‌లోని మువాఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయని పలు మీడియా సంస్థలు నివేదించాయి.
ఇదే కాకుండా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక USS డెల్బర్ట్ D బ్లాక్ సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి వెళ్లింది. యూఎస్ నేవీ MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించాయి. E-11A కమ్యూనికేషన్ విమానం, P-8 పోసిడాన్, E-3G సెంట్రీ నిఘా విమానాలు కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చేరాయి. ఇదిలా ఉంటే, యూఎస్‌కు కౌంటర్ ఇవ్వడానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!