Crime: జైలులో ఉన్న సమయంలో తమ్ముడిని, తన భార్య పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ వ్యక్తి వారి 7 నెలల పాపను హత్య చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. జైలులో ఉన్న సమయంలో భార్య, తన తమ్ముడిని పెళ్లి చేసుకున్నట్లు గమనించిన సదరు వ్యక్తి కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో బీహార్‌కి చెందిన విజయ్ సహానీ(30)ని నిందితుడిగా గుర్తించారు. పసికందును హత్య చేసిన కొన్ని గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Also: Yogi Adityanath: మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్ స్నాచింగ్ కేసులో గత నాలుగేళ్లుగా విజయ్ గురగ్రామ్‌లోని భోంద్సీ జైలులో ఉన్నాడని నిందితుడితో విడిపోయిన భార్య విచారణలో పేర్కొంది. విజయ్ జైలులో ఉన్న సమయంలో సదరు మహిళ అతడి తమ్ముడిని వివాహం చేసుకుంది. వీరిద్దరు ఒక పాపకు జన్మనిచ్చారు. ఏప్రిల్ 24న జైలు నుంచి విజయ్ బయటకు వచ్చాడు. తన భార్య, తన తమ్ముడిని పెళ్లి చేసుకుందని తెలసి ఏప్రిల్ 24-25 మధ్య రాత్రి భార్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కోపంతో విజయ్ పసికందును నేలకేసి కొట్టి చంపాడు. ఘటన తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం నాథుపురా గ్రామంలో పాప మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.