Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse: సిద్ధూ కొత్త సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!
స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ‘తెలుసు కదా’ అనే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుసు కదా చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సిద్ధూ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సిద్ధూకి జోడిగా వెండి తెరపై అలరించే బ్యూటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. భాగ్యశ్రీ బోర్సే.
READ ALSO: AP Government: గుడ్‌న్యూస్.. 22 ఏ జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..!
Also Read
ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం సిద్ధూ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని సితార నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదే నిజం అయితే ఈ బ్యానర్‌లో భాగ్యశ్రీ బోర్సేకి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. భాగ్యశ్రీ గతంలో సితారలో కింగ్డమ్ మూవీలో హీరోయిన్ చేసింది, ప్రస్తుతం సితార నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా సందడి చేయబోతుంది. తాజాగా రూమర్స్ ప్రకారం.. త్వరలో సితార బ్యానర్‌లో తెరకెక్కబోతుందని ప్రచారంలో ఉన్న సిద్ధూ సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజం అయితే సితారలో ఈ బ్యూటీకి హ్యాట్రిక్ సినిమాలు దక్కినట్లు అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
READ ALSO: Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!