Hyderabad Crime: ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు కొందరు కీచకులు ఎక్కడో ఓ చోట వేధిస్తూనే ఉన్నారు. తమ కామ కోరికలను తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే, ఈ విధమైన లైంగిక చర్యలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కామాంధుల ఘాతుకాని ఓ మహిళ బలి అయింది. ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Read Also: Punjab : కడుపులో కవలలు.. భార్యను మంచానికి కట్టి సజీవ దహనం చేసిన భర్త
పోలీసుల కథనం ప్రకారం… ఓ మహిళ మృతదేహం కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏఆర్ పైప్ వర్క్‌షాపు సెల్లార్‌లో పడి ఉండడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహం రక్తంలో ఉండడంతో, అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేసిన పోలీసులు అత్యాచారానికి గురై మృతిచెందిందని గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వైన్ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఆమెను ఒకరు చేతులు, మరొకరు కాళ్లు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏఆర్ పైప్ వర్క్ సెల్లార్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. తిరిగి అదే బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. అక్కడ ఉన్న సెల్లార్ చాలా లోతుగా ఉండటంతో రోడ్డుపై నుంచి చూసినా ఎవరికీ కనిపించదని వారు గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన మహిళ కూలీ పనిచేస్తూ కల్లు తాగుతూ తిరిగేదని తెలిసింది. మృతురాలికి భర్త, పిల్లలు లేనట్లు పోలీసుల విచారణలో తెలిసింది.