ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్ గంజ్‌లో 18 ఏళ్ల యువతి తనను అంకుల్ అని పిలిచిందని 35 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్స్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్‌కు డ్యామేజీ ఉండటంతో దానిని మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్‌ను అంకుల్ అని పిలిచింది. Read…
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో గల నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. నూడుల్స్ పరిశ్రమలో వినియోగిస్తున్న ఓ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో అక్కడే ఉన్న 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై సమాచారం అందిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని సమాచారం. ఈ…
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్లైన్లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో…
కేటుగాళ్ళు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. డబ్బుల కోసం, బంగారం కోసం ఏ గడ్డితినడానికైనా వెనుకాడడం లేదు. మహిళలు, అమ్మాయిలు, ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా వారు వదలడం లేదు. గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. మొత్తం ఇరవై మూడు మంది ముఠాలో ఉన్నారని, పదిమంది నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని అర్బన్ ఎస్పీ వెల్లడించారు. కరోనా సమయంలో జిజిహెచ్ లో చేరిన…
చలి కాచుకునేందుకు ఓ దొంగ ఏకంగా బైక్‌నే తగలబెట్టాడు. ఈఘటన నాగపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. నాగపూర్‌లోని యశోదరా నగర్లో ఇటీవలి కాలంలో పలు బైక్ లు చోరికి గురయ్యాయి. దాంతో పలువురు వాహనాదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో ఓ ముఠాను అరెస్టు చేశారు. చోటా సర్ఫరాజ్‌తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్‌లను దొంగిలించినట్టు…
ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్ శివాజీ (23), బోయిన వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్థన్ రెడ్డి (23) ముగ్గు రు స్నేహితులు . వీరిలో వెంకటేశం, గోవర్థన్‌రెడ్డికి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరితో శివాజీ కలిశాడు. వీరు ముగ్గురు కలిసిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటి వేళ్లలో పుడ్ డెలివరీ బాయ్స్‌గా వెళ్లి…
ఈమధ్యకాలంలో కార్లలో మంటలు తీవ్ర ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. రోడ్ల మీద, హైవేల మీద వెళుతున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. కొంతమంది దురదృష్టవశాత్తూ కొందరు సజీవ దహనం అయిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ చెక్ పోస్ట్ వద్ద స్కార్పియో వాహనంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం పసిగట్టడంతో వాహనం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో ఇద్దరు ప్రయాణికులు వున్నారు. వారంతా బయట పడడంతో తృటిలో తప్పింది…
మీకు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? తనకు నచ్చని వ్యక్తిని తన కుమార్తె ప్రేమించిందని తెలిసి.. ఓ తండ్రి ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోయిస్తాడు. ఇప్పుడు అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు లవ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్పారు. కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో తాము విడిపోయి బ్రతకలేమని ప్రేమజంట నిర్ధారించుకుంది. Read…
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆధార్ కార్డే ఆధారం. దీంతో ఆధార్ కార్డు కోసం జనం నానా ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులిస్తూ మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఫేక్ ఆధార్ కార్డ్ ముఠా అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత కొన్నాళ్ల నుంచి నకిలీ…
జన్మదిన వేడుకల్లో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరూ బీరు బాటిళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సాయి రెడ్డి అనే యువకుడిని తోటి స్నేహితుడు బీరు సీసాలతో కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మ బండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు.…