మానవత్వం మసిబారిపోతోంది. డబ్బుల కోసం, కక్షలతో అయినవారిని కడతేరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో కన్నకొడుకు కర్కశంగా మారిపోయాడు. గోనెగండ్ల లో ఆస్తి కోసం తండ్రిని హత్య చేశాడా తనయుడు. తండ్రిని హత్య చేసి గోనె సంచిలో కట్టి తుంగభద్ర దిగువ కాలువలో పడేశాడు కొడుకు. ఈనెల న 17న గోనెగండ్ల సమీపంలో తుంగభద్ర కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నివ్వెర పోయే చేదు నిజాలు దర్యాప్తులో బయటపడ్డాయి. దర్యాప్తులో గోపాల్(60) ను కుమారుడు బాలరంగడు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. పాల్ మొదటి భార్య 2017 లో మృతి చెందడంతో రెండవ పెళ్ళికి సిద్ధం అయ్యాడు.
అందుకోసం మ్యారేజ్ బ్యూరో వ్యక్తిని సంప్రదించాడు గోపాల్. తన తండ్రి పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుందని తండ్రి హత్యకు కుట్ర చేశాడు బాల రంగడు. మ్యారేజి బ్యూరో వ్యక్తిని లోబరుచుకొని హత్య చేశాడు కుమారుడు బాల రంగడు. ఈ కేసుకి సంబంధించి బాల రంగడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారినుంచి బైక్, పిడి బాకు, 2 సెల్ ఫోన్లు, 25 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. తండ్రిని దారుణంగా హత్యచేసిన కొడుకుని కఠినంగా శిక్షించాలంటున్నారు బంధువులు, స్థానికులు.