ఆడది దేనినైనా ఓర్చుకుంటుంది కానీ, తన భర్తను మరొకరితో పంచుకోవడాన్ని మాత్రం సహించలేదు. పురాణాల కాలం నుంచి తెలిసిన సత్యమే ఇది. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసినవారు ఉన్నారు. భర్తను కాపాడుకోవడం కోసం చంపిన వారున్నారు, చచ్చినవారున్నారు. అయితే భర్త పరాయి మహిళ మోజులో పడితే కొంతమంది సర్దుకుపోతారు.. ఇంకొంతమంది భర్తను రాచి రంపాన పెడతారు. కానీ, ఇక్కడ ఒక భార్య మాత్రం భర్తతో సంబంధం పెట్టుకున్న యువతిపై కక్ష కట్టింది. అతి దారుణంగా ఆమెను హింసించి తన కసిని తీర్చుకొని ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతుంది. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ ప్రాంతంలో నివాసముండే ఒక వ్యక్తికి కోన్నేళ్ళ క్రితం వివాహమైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే వారి కాపురంలోకి ఇటీవల ఒక యువతి ప్రవేశించింది. ఆమెతో ఉంటూ భర్త, ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న భార్య కోపంతో రగిలిపోయింది.
భర్తను తనకు కాకుండా చేసిన యువతిపై కక్ష కట్టింది. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని చూసింది. సమయం కోసం ఎదురుచూసి రెండు రోజుల క్రితం యువతి ఒంటరిగా వస్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసింది. అనంతరం ఆమెను ఒక గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టింది. చేతులు, కాళ్లు కట్టేసి నగ్నంగా మార్చింది. అతి దారుణంగా ఆమె ప్రైవేట్ భాగంలో కారం పూసింది. అంతేకాకుండా అలా నగ్నంగానే ఆమెను రోడ్డు బయటకు విసిరేసింది. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.