Hyderabad: తరగతి గదిలో విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కృష్ణానగర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్‌పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
మన్సూర్ అనే విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలడంతో తోటి విద్యార్థులు ఈ సమాచారాన్ని యాజమాన్యానికి చేరవేశారు. దీంతో వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!