హైదరాబాద్లోని నిజాంపేట్లో దారుణం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి బర్త్డే పార్టీ ఫ్లెక్సీలను చిన్నపిల్లలతో కట్టించాడు. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారులు కరెంట్షాక్కు గురయ్యారు. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు ఓ పిల్లవాడికి చేతులను తీసివేశారు. అయితే మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పిల్లల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.…
కర్ణాటకలోని మంగుళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన ఓ మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే… ఏపీకి చెందిన వైల శీను మంగళూరులో మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ కనిపించలేదు. దీంతో వైల శీనునే ఆ మొబైల్ దొంగిలించాడని మిగతా మత్స్యకారులు భావించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఎక్కడ పెట్టావంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. కనీసం వైల శీను చెప్పేది వినకుండా…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర…
ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు ఎక్కువ అయిపోయారు. వారికి అది ఇది అని ఏం పట్టింపులు ఉండవు ఏది దొరికితే అది చోరి చేసేయడమే వారి లక్ష్యం. తాజాగా గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు గొర్రెల మండి మిర్చి యార్డ్ వద్ద ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే బత్తుల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బత్తుల శ్రీను ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి…
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్టాప్లు,…
పంజాబ్లోని లుథియానాలో దారుణం వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే… లుథియానా శివారులోని మెహర్బన్ ప్రాంత పరిధిలోని చుహర్వాల్ గ్రామంలో ఈనెల 18న రాత్రి కౌర్ అనే వృద్ధురాలితో తల్లి, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కౌర్ ప్రార్థనల కోసం గురుద్వారాకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. కౌర్ చేతబడి చేస్తుందన్న ఆరోపణలతో…
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి…
మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువ అనగానే ఆడవారికి చేతులెత్తి మొక్కుతారు.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనగానే తల్లిని మించిన దైవం లేదని కొటేషన్స్ పెడతారు.. అంతే తప్ప నిజ జీవితంలో ఆడవారిని సురక్షితంగా తిరగనివ్వడంలేదు కామాంధులు.. గుడి, బడి.. ఆఫీస్, పార్క్.. అర్ధరాత్రి .. అపరాత్రి.. బస్సు, వ్యాన్.. చివరికి తండ్రి, అన్న, తమ్ముడు.. కూడా ఆడదాన్ని వదలడం లేదు. కామంతో కళ్ళుమూసుకొని మృగాళ్లుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసితనం.. మరెంతో…
మూఢనమ్మకాలు ప్రజలను ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తాయి. తాజాగా ఈ మూఢనమ్మకం వలన ఒక వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. అయితే ఇప్పటివరకు సన్నిత కడుపు పండలేదు.. ఎన్నో గుడులు, గోపురాలు తిరిగారు అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే బంధువులు వేరొక మహిళా ప్రసవించిన బొడ్డు తాడు తింటే వెంటనే పిల్లలు పుడతారని చెప్పడంతో…
జూబ్లీహిల్స్ స్పాయిల్ పబ్ లో దారుణం చోటు చేసుకోంది. యువతిని మాట్లాడదామని పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి కి చెందిన బిజిన్ అనే యువకుడు.. ఒక బ్యూటిషన్ తో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 11 న…