వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుందన్న.. ఫైనల్లో గెలవాలని ఆశతో ఉంది టీమిండియా. మరోవైపు వరల్డ్ కప్ చరిత్రలో 8వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. మరో చారిత్రాత్మక విజయం కోసం ఎదురుచూస్తుంది.
Read Also: World Cup 2023: ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలో మెరువనున్న పాప్ స్టార్ దువా లిపా..!
2023 వరల్డ్ కప్ లీగ్ దశ
2023 వరల్డ్ కప్ లీగ్ దశలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి వరల్డ్ కప్ 2023లో రెండో నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97) పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
2019 వరల్డ్ కప్
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీకి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కెప్టెనీ బాధ్యతలు వహించారు. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 36 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. తొలి వికెట్‌కి 22.3 ఓవర్లలో 127 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభానిచ్చారు. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 316 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో అత్యధికంగా.. డేవిడ్ వార్నర్ 56, స్టీవ్‌స్మిత్ 69 పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.
2015 వరల్డ్ కప్
న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2015 టోర్నీలో సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు వహించారు. మొదట బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ ఆరోన్ ఫించ్ 116 బంతుల్లో 81 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 93 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు, మోహిత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ చేశారు. ఆ తర్వాత 329 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 233 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు 34, శిఖర్ ధావన్ 15, అజింక్య రహానే 44, కెప్టెన్ ధోని 65 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జేమ్స్ ఫాల్కనర్ 3, జాన్సన్ 2, హేజిల్ ఉడ్ ఒక వికెట్ తీశారు. ఈ టోర్నీలో సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు ఆసీస్ జట్టు టోర్నీ గెలుచుకుంది.
2011 వరల్డ్ కప్
2011 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ రికీ పాంటింగ్ 104 పరుగులు చేశాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్ 25, బ్రాడ్ హ్యాడిన్ 53, చివర్లో డేవిడ్ హస్సీ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 4వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 15, సచిన్ టెండూల్కర్ 53, గౌతమ్ గంభీర్ 50, కోహ్లీ 24, యువరాజ్ సింగ్ 57, సురేశ్ రైనా 34 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, టైట్, వాట్సన్, డేవిట్ హస్సీ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంకపై ఇండియా భారత్ ఘన విజయం సాధించింది.
2007 వరల్డ్ కప్
2007 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో మధ్యలోనే ఇంటి బాట పట్టా్ల్సి వచ్చింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ వరల్డ్ కప్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
2003 వరల్డ్ కప్
2003 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా గెలుపొందింది. కెప్టెన్ గా సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించారు. భారత బ్యాటింగ్ లో సచిన్ టెండూల్కర్ 36, హర్భజన్ సింగ్ 28, అనిల్ కుంబ్లే 16, దినేష్ మోంగియా 13 పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ 3, జాసన్ గిలిప్స్ 3, బ్రాడ్ హాగ్, డారన్ లెహమన్, మెక్ గ్రాత్ తలో వికెట్ తీశారు. ఇక ఆసీస్ బ్యాటింగ్ లో గిల్ క్రిస్ట్ 48, హెడెన్ 45, రికీ పాంటింగ్ 24 పరుగులు చేశారు. మరోసారి ఫైనల్ వరకు వెళ్లిన ఇరు జట్లు.. చివరలో ఆస్ట్రేలియా జట్టు ఇండియాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులతో శతకం సాధించారు. ఓపెనర్ గిల్ క్రిస్ట్ 57, హెడెన్, 37, మార్టిన్ 88 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు తప్ప.. ఇంకెవరు వికెట్లు పడగొట్టలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 47, యువరాజ్ సింగ్ 24, గంగూలీ 24 పరుగులు చేశారు. ఈ ఫైనల్ మ్యా్చ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొంది టోర్నీని సొంతం చేసుకుంది.