ఎట్టకేలకు ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది. 338 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన పాక్.. 246 పరుగులకు ఆలౌటైంది.
వరల్డ్ కప్ 2023 లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా పాకిస్తాన్ బౌలర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా రవూఫ్ నిలిచాడు. ఈరోజు ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డును సాధించాడు. వరల్డ్కప్ 2023లో 9 మ్యాచ్లు ఆడిన రవూఫ్ అందరి బౌలర్ల కంటే ఎక్కువగా 533 పరుగులిచ్చాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫేవరేట్స్ లో ఒక జట్టుగా బరిలోకి దిగిన పాకిస్తాన్ తగినంత రీతిలో రాణించకపోవడంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ అనంతరం బాబర్ అజామ్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని కొన్ని మీడియా కథనాలలో పేర్కొంది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది.ా
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకునే అంశంపై క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర విషయాలను తెలిపాడు. నాడు టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు, సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రోహిత్ శర్మ వెనుకంజ వేశాడని పేర్కొన్నాడు.