బీసీసీఐ సెక్రటరీ జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడంటూ జై షాపై.. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున జై షాకు క్షమాపణలు తెలుపుతున్నట్లు చెప్పారు. తమ బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దడం మంచి పద్దతి కాదు అని తెలిపారు.
Read Also: Team India: ఫైనల్స్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా..
అయితే ఈ ప్రపంచకప్ లో శ్రీలంక అత్యంత పేలవ ప్రదర్శన చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా.. భారత్ తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్‌ఎల్‌సీ కార్యవర్గాన్ని రద్దు చేసింది. దీంతో మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు.
Read Also: Rohingya refugees: సముద్రం నుంచి సముద్రంలోకి.. రోహింగ్యాలను వెనక్కి పంపిన ఇండోనేషియా..
అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో రుణతుంగా జైషాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నాడు. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడేనని విమర్శించాడు. భారత్‌లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడని.. అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్ కనుక అతను చాలా పవర్‌ఫుల్ అని సంచలన ఆరోపణలు చేశాడు.