వైభవంగా కోటిదీపోత్సవం.. ఇలకైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది.. ఇప్పటికే మూడు రోజుల పాటు కన్నుల పండుగా సాగిన ఈ దీపయజ్ఞంలో భక్తులు పరవశించిపోతున్నారు.. కోటి దీపోత్సవంలో 3వ రోజు ఉత్సవంలో భాగంగా అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.. అశేష భక్తజనం శివనామస్మరణతో.. ఇల కైలాసంగా మారిపోయిన ఎస్టీఆర్ స్టేడియంలో మార్మోగింది.. ఇక, నాల్గోరోజు ఇల కైలాసంలో జరగనున్న విశేష కార్యక్రమాలను విషయంలోకి వెళ్తే..
* నాగులచవితి శుభవేళ భక్తుల గ్రహదోషాలు హరించేలా శ్రీకాళహస్తి ఆలయ అర్చకులచే రాహుకేతు పూజ
* అనంతపుణ్యప్రదం శ్రీకాళహస్తీశుని కల్యాణోత్సవం
* సింహ, గజ వాహనాలపై పార్వతీపరమేశ్వరుల దర్శనం
* సకలసౌభాగ్యాలను ప్రసాదించే కొల్హాపూర్ మహాలక్ష్మీ దివ్యదర్శనం
* కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం
* కుక్కే శ్రీసుబ్రహ్మణ్య మఠం శ్రీవిద్యాప్రసన్న తీర్థస్వామి అనుగ్రహభాషణం
* శ్రీ మల్లాది వేంకట రామనాథశాస్త్రి ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
* స్వర్ణ లింగోద్భవ వైభవం
* మహా దేవునికి మహా నీరాజనం
* అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు
వారికి సీఎం గుడ్‌న్యూస్.. నేడు పట్టాల పంపిణీ
అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఆయన రైతులకు పట్టాలు అందించనున్నారు.. ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. 2003కు ముందుకు సంబంధించిన అసైన్డ్‌భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీ చేయనున్నారు.. ఈ పర్యటన కోసం.. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూముల పై సర్వ హక్కులు కల్పిస్తూ.. పట్టాలు అందజేస్తారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల 24 వేల 709 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. 35 లక్షల 44 వేల 866 ఎకరాలపై అసైన్డ్ రైతులకు హక్కులు కల్పించనున్నారు.. కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.. 9,064 ఎకరాల లంక భూముల్లో 17, 768 మందికి అసైన్డ్ పట్టాలు ఇస్తారు.. తద్వారా అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 15 లక్షల 21 వేల 160 మంది రైతులు లబ్ధిపొందుతారు.. ఇక, 27 లక్షల 41 వేల 698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తారు.. 1563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని కేటాయించాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది.
నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న మల్లికార్జున్ ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలు మేనిఫెస్టో ప్రకటనలపై నజర్ పెట్టాయి. ఇందులో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. ఇవాళ రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టోలోని అంశాలను వివరించనున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని హస్తం నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
వార్డు సభ్యులు గౌరవ వేతనం
ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం
నేడే మూడు నియోజకవర్గాల్లో ఈటల పర్యటన.. వివరాలు ఇవే..
ఇవాళ బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు నియోజక వర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దూలపల్లి, కొంపల్లి మున్సిపాలిటీ పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు చంద్రగిరి కాలనీ, గాజుల రామరాం డివిజన్ లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 02 గంటలకు మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్, శామీర్ పేట మండలంలో ప్రచారం చేయనున్నారు. ఇక సాయంత్రం 05 గంటలకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రచారంతో ఈటల రాజేందర్ ఇవాల్టి ప్రచారం ముగుస్తుంది.
తెరుచుకున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిన్న (గురువారం) సాయంత్రం తెరిచారు. ఇక, మండల పూజ సీజన్ స్టార్ట్ కావడంతో ఆలయాన్ని తెరిచారు. రెండు నెలల పాటు భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఈసారి అయ్యప్ప ఆలయం భక్తులకు సరికొత్తగా కనిపించనుంది. ఎందుకంటే, ఆలయ ముఖ ద్వారం దగ్గర కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఈ శిలలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ శిలలపై అందమైన కళాకృతులు కట్టిపడేస్తున్నాయి. అలాగే, వాటిపై స్వామియే శరణం అయ్యప్ప అని రాశారు. ఇక, ఆలయ ముఖ ద్వారం దగ్గర హైడ్రాలిక్ రూఫ్‌ని హైదరాబాద్‌కి చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. చెన్నైకి చెందిన ఓ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. ఆలయంలోని 18 బంగారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై ఈ రూఫ్ ఏర్పాటు చేశారు. వర్షం లేని సమయంలో ఆ రూఫ్‌ను మడత పెట్టెసుకోవచ్చు.. డిసెంబర్ 27న మండల దీక్ష సీజన్ ముగియనుంది. అప్పుడు శబరిమల ఆలయాన్ని మూసివేసి.. తిరిగి మకర సంక్రమణ రోజైన డిసెంబర్ 30న దేవాలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత జనవరి 15న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. అయితే, శబరిమల ఆలయానికి వెళ్లే.. భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేకంగా ట్రైన్స్ ను నడుపుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల కలకలం.. రెండు చోట్ల ఐఈడీ పేలుడు
ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌తో నక్సలైట్లు మళ్లీ తమ క్రియాశీలతను చాటుకున్నారు. నక్సలైట్లు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు ఐడీ పేలుళ్లు చేశారు. పోలింగ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడిన ప్రాంతం ధామ్‌తరిలోని సిహవా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు 5 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. సిహవా అసెంబ్లీ నియోజకవర్గంలోని ధామ్‌తరిలో రెండు వేర్వేరు చోట్ల నక్సలైట్లు తక్కువ తీవ్రత కలిగిన బాంబులను పేల్చారు. ఆ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరిస్తామంటూ బెదిరించారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఇలాంటి బెదిరింపులు చేశారని చెబుతున్నారు. అయితే, ఎన్నికల సంఘం సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌తో పాటు తగిన భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. నక్సలైట్ల ప్రధాన ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహించినట్లే, నక్సలైట్ల ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఓటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవుతుంది.
పాపం దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో వెనుదిరగడం ఇది అయిదోసారి! చోకర్స్ ముద్ర పోయేదెప్పుడు
వన్డే ప్రపంచకప్‌లు ఎన్ని వస్తున్నా.. దక్షిణాఫ్రికా జట్టు రాత మాత్రం మారడం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా టీమ్ నిజం చేసింది. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. దాంతో ‘చోకర్స్’ అనే ముద్రను తొలగించుకుందామనుకున్న ప్రొటీస్‌కు నిరాశే ఎదురైంది. కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం దక్షిణాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. దక్షిణాఫ్రికా అయిదోసారి వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి పాలైంది. ఇదివరకు 1992, 1999, 2007, 2015లోనూ సెమీ ఫైనల్లోనే ప్రొటీస్ ఇంటిదారి పట్టింది. కేవలం వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో మాత్రమే కాదు.. టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే కథ. 2009, 2014లలో సెమీస్ నుంచే నిష్క్రమించింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లను కలుపుకుంటే.. దక్షిణాఫ్రికా సెమీస్‌లో ఓడిపోవడం ఇది ఏడోసారి. ప్రపంచకప్ 2023లో ఫుల్ జోష్ మీదున్న ప్రొటీస్ కీలక సెమీస్‌లో చేతులెత్తేసి మూల్యం చెలించుకుంది. దాంతో ‘చోకర్స్’ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చోకర్స్ ముద్ర పోయేదెప్పుడు, చోకర్స్ ముద్ర పోగొట్టుకునేందుకు దక్షిణాఫ్రికా ఇంకెంతకాలం ఎదురుచూడాలి అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
వివో నుంచి మరో స్మార్ట్ వాచ్.. అదిరిపోయే ఫీచర్స్..
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త ప్రోడక్ట్ లను తీసుకొస్తుంది.. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. వివో వాచ్ 2 కు మంచి స్పందన వచ్చింది.. ఇప్పుడు వివో వాచ్ 3 ని మార్కెట్ లోకి తీసుకొని వచ్చేస్తుంది .. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్.. త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.. ఈ వాచ్ ఫీచర్స్ వల్ల ఎక్కువగా యూత్ ఈ వాచ్ కోసం తెగ వెతుకుతున్నారు.. ఇక ఈ వాచ్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ వాచ్ లో 1.43 ఇంచెస్‌తో కూడిన రౌండ్ స్క్రీన్‌ను అందించారు. బ్లూ ఓఎస్‌తో పనిచేయనున్న ఈ వాచ్‌లో 16 రోజులు లైఫ్ ఇచ్చే బ్యాటరీని అందించారు. పలు రకాల హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా అందించింది.. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. థిన్నర్ స్టైలిష్ డిజైన్‌తో రూపొందించారు. స్టెయిన్‌లెస్ స్టీల్ రొటేటింట్ క్రౌన్‌ను కూడా ఇచ్చారు..
వారికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను..
శ్రీలీల..టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది…హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా మొదట ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని అస్సలు నమ్ముకోవద్దని ఆమె సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తి లో కూడా సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘డాక్టర్ కావాలన్నది నా చిన్ననాటి కల. ఆ విషయంలో నా పేరెంట్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారు. ఇక నటిగా ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను.. ఏదీ ఏమైనా డాక్టర్ కావడం నా మొదటి లక్ష్యం గా నిర్ణయించుకున్నాను. ఆ వృత్తిలో వచ్చే సంతృప్తే వేరు. ప్రతి అమ్మాయి తమ ప్రతిభ మేరకు ఇష్టం ఉన్న రంగాల్లో రాణించేందుకు ఎంతగానో కృషి చేయాలి’ అని చెప్పింది. ఈ భామ రీసెంట్ గా హీరో రామ్ పోతినేని సరసన నటించిన సినిమా స్కంద.. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు.. అలాగే భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా అద్భుతంగా నటించి మెప్పించింది.. దసరా కానుకగా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది.అలాగే ఈ భామ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పవన్ కల్యాణ్ హీరో గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే హీరో నితిన్ సరసన ఎక్సట్రా ఆర్డినరీ మాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమాల మీదనే శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది.