ఆర్టీసీ బస్సు ఎక్కు.. గిఫ్ట్ పట్టు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో ప్రయాణికుల ముందుకు వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పుడు బస్సు ఎక్కండి.. గిఫ్ట్ పట్టిండి అనే విధంగా కొత్త పథకానికి తీసుకొచ్చింది.. శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2 డిపోల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారికి బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ… ఆమదాలవలస, బందరువానిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తావల్లి, యరగాం, విజయనగరం మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అయితే, బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులు.. వారి టిక్కెట్ల వెనుక పేరు, మొబైల్ నంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిప్ట్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.. ఇక, ప్రతి నెల 3వ తేదీ, 16 తేదీల్లో గిఫ్ట్ బాక్స్‌ల్లో వేసిన టికెట్లను కలిపి డ్రా తీస్తారు.. ఆ వెంటనే విజేతలను ప్రకటిస్తారు.. ఇక, డ్రాలో గులుపొందిన వారికి గిఫ్ట్‌లు అందజేయనుంది ఏపీఎస్‌ఆర్టీసీ.. అయితే, శ్రీకాకుళం మాత్రమే కాదు.. పలు జిల్లాల్లో ఇలాగే బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా.. ఎక్కువమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడమే దిశగా ఇలాంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల రూట్లలో ఈ లక్కీ డ్రాను తీసుకొచ్చారు.. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.
బీజేపీపై దాష్ర్పచారం.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది..!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె.. నెల్లూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు పురంధేశ్వరి.. నెల్లూరులో రైల్వే స్టేషన్ ను 102 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోందని తెలిపారు. రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నారు.. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. నీటిపారుదల.. రహదారుల నిర్మాణంతో పాటు నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు బీజేపీ ఆంధ్రపదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
ఓటర్ లిస్ట్ కన్నా.. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉంది అంటూ ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వ వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు, ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు ? అంటూ ఫైర్ అయ్యారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అని మండిపడ్డారు.
ధర్మారెడ్డి ఓ దొంగ, బ్రోకర్.. టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డ టీడీపీ నేత
టీటీడీ ఇంచార్జ్ ఈవో ధర్మారెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఇంఛార్జ్ ఈవో ధర్మా రెడ్ది ఒక దొంగ.. ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఇక, ధర్మారెడ్డి ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా.. చల్లా కొండయ్య కమిషన్ నిర్ణయాలను ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆమెదించింది.. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రి అయినా తర్వాత టైటిఫిలో ధర్మారెడ్డి వోఎస్‌డీగా నియమితులయ్యాడు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త పోస్ట్ సృష్టించి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు.. వైఎస్ కుటుంబం కోసం ఢిల్లీలో చక్రం తిప్పే ధర్మారెడ్డికి తిరుమలలో ఉద్యోగం ఇచ్చారు అని విమర్శించారు. 1987 చట్టం ప్రకారం ఈవో, జేఈవో ఉండగా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎలా నియమిస్తారు. దీనికి అసెంబ్లీ ఆమోదం ఉందా..? అసెంబ్లీ ఆమోదం లేదు కాబట్టే ధర్మారెడ్డి ఒక డమ్మీ అని వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డి తన స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. తహసీల్దార్, ఆర్డీవోగా కూడా పని చేయని ధర్మారెడ్డికి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అర్హత లేదన్నారు వెంకటరమణారెడ్డి. ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఫేక్ ఆఫీసర్.. రూ. 4వేల కోట్లున్న తిరుమల బడ్జెట్ కు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ ను అధికారిగా చంద్రబాబు వేశారు.. ఐ.ఆర్.ఎస్ అధికారి ఉంటే దేవస్థానం డబ్బులు దొంగిలించడానికి వీలు ఉండదు కాబట్టి.. ఒక ఛార్టర్డ్ అకౌంట్ గా ఉన్న ఆఫీసర్ ను చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా నియమించారు అని గుర్తుచేశారు. ఇక, వైఎస్ వివేకానంద రెడ్ది హత్యలో ధర్మారెడ్డికి సంబంధం ఉంది అని సంచలన ఆరోపణలు చేశారు. స్వయాన వివేకానంద రెడ్ది కూతురు సునీతానే ఈ విషయం చెప్పిందన్న ఆయన.. సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న ధర్మారెడ్డికి ఢిల్లీలో వైఎస్ అవినాష్ రెడ్ది ఇంట్లో ఏం పని? సమయం, ప్లేస్ ఎప్పుడు చెప్పినా నేను ధర్మారెడ్డి విసిరిన ఛాలెంజ్ కి సిద్ధం.. త్వరలో వీఆర్ఎస్ తీసుకొని ధర్మారెడ్డి.. నంద్యాల లోక్ సభ స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారని దుయ్యబట్టారు.
అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..! చంద్రబాబుతో రూ.1,500 కోట్ల డీల్..!
మెగా బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్.. కాపులను అమ్మేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.. 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వెనుక ఉంటారా? నాతో ఉంటారా? కాపులు తెల్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 సీట్లకు 1,500 కోట్ల రూపాయలకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడు అని విమర్శించారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా..? గుండు గీసే కాపులు కావాలా..? తేల్చుకోవాలన్నారు. మరోవైపు.. మీ నాన్న (వంగవీటి రంగా)ను చంపిన వారితో ఉంటారా? నాతో ఉంటారో వంగవీటి రాధా తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో.. విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెట్టనుంది. ఓటింగ్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. హస్తం పార్టీ ఆరు హామీలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహాలక్ష్మి యోజన, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత అనే ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఖర్గే, రేవంత్, భట్టి.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు చేరుకుని కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనేక ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో అభయహస్తం మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదలకు సమయం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల కానుంది. గాంధీభవన్‌లో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించడమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని హస్తం నేతలు చెబుతున్నారు.
మహిపాల్ రెడ్డి నీ అంతు చూస్తా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వార్నింగ్..
మహిపాల్ రెడ్డి అనవసరంగా పోలీసులను మాపై ఊసిగొల్పితే సహించేది లేదని, మహిపాల్ రెడ్డి నీ అంతు చూస్తా అని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నివాసం వద్ద మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చాట్ పూజకు పోలీసులు అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. బీజేపీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అపహాస్యం చేస్తున్నారనిద అన్నారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి ఎన్నికలలో పంచేందుకు 30కోట్ల రూపాయలు డంప్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదే మైత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఛాట్ పూజకు ఎలా పర్మిషన్ ఇచ్చారని మాకెందుకు ఇవ్వరని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలని.. వారిపై ఉన్నతాధికారులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ గురువారం నుండి ప్రారంభమైంది. ఇది పెద్ద విజయాన్ని సాధించింది. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ డీహెచ్ పోరా ప్రాంతంలోని సమనో పాకెట్‌లో జరిగింది. ఇందులో రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు, CRPF సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులను చుట్టుముట్టిన తరువాత భద్రతా దళాలు గ్రామం చుట్టూ లైట్లను ఏర్పాటు చేశాయి. తద్వారా వారు తప్పించుకునే అవకాశం ఉంది. చొరబాటు యత్నంలో ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అంతకుముందు నవంబర్ 15న కూడా ఉరీ సెక్టార్‌లో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. చొరబాట్లను అరికట్టేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కలి’ ప్రారంభించాయి. ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ తర్వాత, బషీర్ అహ్మద్ మాలిక్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు సైన్యం తెలిపింది. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ భారత్ లో నిర్వహించిన వర్చువల్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క రెండవ ఎడిషన్‌లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన అనాగరికమైన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. అలాగే, ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. పశ్చిమాసియాలో అభివృద్ధిలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, సవాళ్లను హైలైట్ చేయడానికి జనవరిలో ‘వాయిసెస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్’ మొదటి ఎడిషన్‌ను భారత్ నిర్వహించింది. అయితే, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21వ శతాబ్దపు మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే అత్యంత ప్రత్యేకమైన వేదిక అని ప్రధాని మోడీ అన్నారు. సంప్రదింపులు, కమ్యూనికేషన్, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల – ‘ఫైవ్ సి’ల ఫ్రేమ్‌వర్క్ కింద సహకారం కోసం కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారత్ కృషి వల్ల ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా చేర్చిన ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని మరచిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో ఒక ముఖ్యమైన మైలురాయిగా, సెప్టెంబర్‌లో ఆఫ్రికన్ యూనియన్ 1999లో ప్రారంభమైనప్పటి నుండి ప్రభావవంతమైన కూటమి విస్తరణలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహంలో కొత్త శాశ్వత సభ్యు దేశంగా అవతరించింది.
ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 600 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 7లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అర్హతలు మొదలగు వివరాలను తెలుసుకుందాం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దీనికి అర్హులే.. 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (2029 ఏప్రిల్ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.. ఆన్లైన్లో పరీక్షను రాయాల్సి ఉంటుంది.. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు, మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి పావుమార్కు మైనస్ చేస్తారు..
సూర్యకుమార్ ఔట్.. ఫైనల్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!
భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తుది దశకు చేరుకుంది. మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాపై గెలిచి 2003 పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలని ఆసీస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనల్‌లో బరిలోకి దిగే భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్పెలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు కారణం.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండడమే. అశ్విన్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లకు పరుగులు చేయడం అంత సులువు కాదు. ఓపెనర్లు వార్నర్, హెడ్ లెఫ్టాండర్లు కాబట్టి.. యాష్ బౌలింగ్‌లో పరుగులు సాధించడం వారికి కష్టమే. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అత్యంత కీలకం కాబట్టి.. వారు భారీ ఇన్నింగ్స్ ఆడకుండా ఆపాలంటే అశ్విన్ జట్టులో ఉండటం ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అశ్విన్ జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ కాస్త బలహీనం అవుతుంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో. భారత్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తున్నారు. ముఖ్యంగా షమీ ఐదేసి వికెట్స్ పడగొడుతూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. గత మ్యాచులో తడబడిన బుమ్రా, సిరాజ్ ఫైనల్లో మెరవాల్సి ఉంది. స్పిన్ బౌలింగ్ బలహీనత ఉన్న ఆసీస్ బ్యాటర్లు.. కుల్దీప్, జడేజాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
శరవేగంగా ‘పోలీసు వారి హెచ్చరిక’ షూట్
దర్శకుడు “బాబ్జీ” దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలు వంటి వాటి జోలికి భిన్నంగా దసరా పండగ రోజున “” సినీ కళామతల్లికి జై…వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ… వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ “” అనే నినాదాల మధ్య యీ సినిమా ఓపెనింగ్ చేశారు మేకర్స్. “దసరా రోజున ప్రారంభమైన యీ సినిమాకి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్, ఘట్ కేసర్, ఘణపూర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో జరుపుకుంటూ 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్ లను పూర్తి చేసుకుందని, డిసెంబర్ మొదటి వారం నాటికి యీ చిత్రం తాలూకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు బాబ్జీ వెల్లడించారు. “మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే , మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలో, పడే తపనలో , తీసుకునే జాగ్రత్తలో కొంతయినా మన కళ్ళ ముందు తిరుగుతున్న అనాథలు అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తులు చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారే ప్రమాదం ఉందని సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని డైరెక్టర్ బాబ్జీ తెలిపారు. “భారత సైన్యంలో దేశరక్షణ కోసం పని చేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా, దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో వున్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి యీ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో యీ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తున్నామని నిర్మాత బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను యీ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర యీ చిత్రానికే ఆయువు పట్టు లాంటి పాత్రని జనార్దన్ తెలిపారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్, హనుమా, బాబూరాం