World Cup 2023: ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలో మెరువనున్న పాప్ స్టార్ దువా లిపా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరనున్న ఫైనల్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమవుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి.. ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో భారత్-ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.
Read Also: Andhrapradesh: ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
యూకేకి చెందిన ఈ లేడీ సింగర్ కు వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులు ఉన్నారు. తన ఆటపాటతో కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవల పాడిన ‘హౌడిని ట్రాక్’ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి.. గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. దువా లిపా ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నట్లు వరల్డ్ కప్ కు అధికారిక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ కూడా తెలిపింది. ఆమె ఆటపాటతో ఈ వరల్డ్ కప్ అద్భుతంగా ముగియనుందని స్టార్ స్పోర్ట్స్ చెప్పుకొచ్చింది.
Read Also: Deepfakes: “డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనలిస్ట్‌లతో పరస్పర చర్యలో.. దువా లిపాను శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, కేన్ విలియమ్సన్ మొదలైన క్రికెటర్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇంటరాక్షన్ సమయంలో.. మీరు ఏ పాటను ప్రదర్శిస్తారని గిల్ అడిగాడు. చూడాలి మరీ ఫైనల్ లో దువా ప్రదర్శన ఇస్తుందో లేదో…. ఇదిలా ఉంటే.. ఫైనల్ లో భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శన చేస్తుందని ఇప్పటికే తెలిపింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు ప్రజలను ఆకట్టుకుంటుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో ప్రకటించారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!