పదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. నేడు ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..
ఎన్టీవీ, భక్తి టీవీ కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇక, ఈ రోజు కోటి దీపోత్సవం వేదికగా ఒంటిమిట్ట కోందరాముని కల్యాణోత్సవం జరగనుంది.. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు సాగిన కోటిదీపోత్సవం వేదిక.. ఈ రోజు శ్రీరాముని రాకతో మరింత వెలుగులు నింపనుంది.
కోటిదీపోత్సవంలో 10వ రోజు కార్యక్రమాలు..
* నేడు రామభక్తి సామ్రాజ్యాన్ని తలపించనున్న ఇల కైలాసం
* కోటి దీపోత్సవ వేదికపై ఒంటిమిట్ట రామయ్య, కొండగట్టు అంజన్న సాక్షాత్కారం
* సకలాభీష్టప్రదాయకం భక్తులచే ఆంజనేయస్వామికి కోటితమలపాకుల అర్చన
* కమనీయం కడు రమణీయం శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం
* హనుమంత వాహనంపై జనకీరాముల వైభోగం
* కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం
* ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మహాభిషేకం
* ఇస్కాన్ విశాఖపట్నం మాతా నితాయి సేవని అనుగ్రహభాషణం
* బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం
* అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు
* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు
వారికి గుడ్‌న్యూస్.. ఈ రోజే ఖాతాల్లో సొమ్ము జమ
కొన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలు విషయంలో ముందుకు సాగుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు సీఎం జగన్.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లిళ్లు చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనుంది ఏపీ సర్కార్.. ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇవాళ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్ధిక సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరనుండగా.. 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్ జగన్ సర్కార్ అందించిన మొత్తం సాయం 349 కోట్ల రూపాయలు కాగా.. 46 వేల మందికి లబ్ధి పొందారు.. అయితే, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించింది సర్కార్.. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టిన విషయం విదితమే..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలికపాటి తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుంచి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో అక్కడక్క చిరుజల్లులు కురుస్తున్నాయి. బండంపేట్, చంద్రాయణ గుట్ట, మాధాపూర్ పలుచోట్ల వాన జల్లులు కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.
వైరల్ అవుతున్న కేటీఆర్ ఆడియో.. అందులో ఏమన్నారంటే…
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఐటీ మంత్రి కేటీఆర్ ఒకరు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే ఈసారి మంత్రి కేటీఆర్‌కి సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ పై అసంతృప్తితో ఉన్నారని, ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ కు ఎదురుగాలి వీస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరని టాక్ జోరుగా సాగుంది. నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటారని ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా.. సిరిసిల్ల పట్టణంలో పెద్దసంఖ్యలో పద్మశాలీలపై ఆత్మగౌరవ నినాదం పనిచేస్తుండడంతో పాటు తమ వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ వర్గాలను కలవరపరుస్తోంది. అయితే.. ఈ ప్రచారం నిజమేనంటూ కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గానికి చెందిన ఓ నేతతో కేటీఆర్ ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేటీఆర్ తన నియోజకవర్గంలో ప్రచారం చేయడంలో క్యాడర్ వెనుకబడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలో ఓటమి భయంతోనే కేటీఆర్ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారని హస్తం పార్టీ ప్రచారం చేస్తోంది. దీంతో ఆడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
బిర్యానీ కోసం 60సార్లు పొడిచి చంపిన 16ఏళ్ల పోరగాడు
దేశరాజధాని ఢిల్లీలో ప్రతి మనిషిని కలచివేసే ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 16 ఏళ్ల బాలుడు తన పొరుగున నివసిస్తున్న 17 ఏళ్ల మైనర్‌ను కత్తితో పొడిచి చంపాడు. నిందితుడు అతడి ఛాతీ, మెడపై ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 60 సార్లు కత్తితో దాడి చేశారు. అంతే కాదు, ఘటన తర్వాత నిందితుడు మృతదేహం దగ్గర డ్యాన్స్ కూడా చేశాడు. ఘటనానంతరం గాయపడిన మైనర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన మొత్తం ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం వెల్‌కమ్ ఏరియాలో జరిగింది. నిందితుడు కూడా మైనర్ అని, స్కూల్ డ్రాప్ అవుట్ అని పోలీసులు తెలిపారు. అతనిపై ఇప్పటికే ఓ హత్య కేసు పెండింగ్‌లో ఉంది. అబ్బాయిలిద్దరూ స్వాగత ప్రాంతంలోని జాఫ్రాబాద్ సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తున్నారు. జనతా మజ్దూర్ కాలనీ సమీపంలో నిందితుడు బాధిత యువకుడిని పట్టుకుని బిర్యానీ తినేందుకు రూ.350 అడగడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..200మంది మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా అధికారులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని గంటల క్రితం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు IDF చేసిన ఈ దాడి వెలుగులోకి వచ్చింది. ఈ దాడులతో హమాస్ అప్రమత్తమైంది. ఒప్పందం ప్రకారం, కాల్పుల విరమణ గురువారం ఉదయం 10 గంటల నుండి ఆదివారం వరకు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఒప్పందం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని హమాస్ నేతృత్వంలోని గాజా ప్రభుత్వ సమాచార విభాగం బుధవారం తెలిపింది. IDF ఆపరేషన్ల ఫలితంగా మంగళవారం ఉదయం నుండి 24 గంటల్లో గాజాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా మిలిటెంట్ల మధ్య 47వ రోజు జరిగిన పోరులో గాజాలో బాంబు దాడుల వల్ల డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని స్థానిక మీడియా నివేదించింది. బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ బాంబు దాడిలో 80 మందికి పైగా, ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారు. దాడుల సమయంలో ఇళ్లు, భవనాలు, నివాస అపార్ట్‌మెంట్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు విస్తృతంగా నష్టం వాటిల్లినట్లు వార్తా సంస్థ నివేదించింది.
రెండు వేల మందితో దేవర డాన్స్…
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, శ్రీకాంత్, ఇతర కాస్ట్ పైన సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. నైట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే దేవర ఒక గ్రాండ్ సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే దాదాపు 2000 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఎలాంటి డాన్సర్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ డాన్సర్ కి అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తగిలితే థియేటర్స్ లో ఫైర్ వర్క్స్ జరిగినట్లే. ఇప్పుడు ఈ ఇద్దరికీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా కలిసాడు. అనిరుధ్ కంపోజ్ చేసిన సూపర్ ట్యూన్ కి స్టెప్స్ కంపోజ్ చేయనున్నాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఎన్టీఆర్-ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాంబినేషన్ లో సూపర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఆస్కార్ మాస్టర్ ఎన్టీఆర్ తో స్టెప్స్ వేయించిన ప్రతిసారీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు దేవర ఆ సాంగ్స్ ని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో కూర్చోవడం గ్యారెంటీ. కెరీర్ బెస్ట్ సాంగ్ ని అనిరుధ్ కంపోజ్ చేసాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదే నిజమైతే దేవర సాంగ్… పాన్ ఇండియా థియేటర్స్ కి షేక్ చేయడం గ్యారెంటీ. ఇదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రాణం పోసిన కొమురం భీముడో పాట 100 మిలియన్ వ్యూస్ టచ్ అవ్వడంతో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఘనంగా జరిగిన సీరియల్ నటుడు మానస్ వివాహం.. ఫోటోస్ వైరల్..
బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం.. ఇక విషయానికొస్తే మానస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీజ అనే విజయవాడకు చెందిన అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిన్న నవంబర్ 22 బుధవారం రాత్రి మానస్ – శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదెక్కడి మాస్ వార్నింగ్ అన్న…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని” స్ట్రెయిట్ గా చెప్పేసాడు. ఈ కామెంట్స్ విన్న వాళ్లు సందీప్ ఎదో క్యాజువల్ చెప్పాడు అనుకున్నారు కానీ అనిమల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మాత్రం సందీప్ ఊరికే చెప్పలేదు, బాలీవుడ్ కి బొమ్మ చూపించబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. పోస్టర్స్ నుంచి సాంగ్స్ వరకూ ప్రతి విషయంలో వైల్డ్ గా ఉన్న అనిమల్ ప్రమోషనల్ కంటెంట్… ట్రైలర్ రిలీజ్ తో పీక్స్ చేరబోతోంది. ఈరోజు అనిమల్ ట్రైలర్ రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మూడు నిమిషాల ముప్పై అయిదు సెకండ్ల నిడివితో ట్రైలర్ కట్ చేసిన సందీప్… గత రాత్రి సెన్సేషనల్ ట్వీట్ చేసాడు. “నెక్స్ట్ ఫిల్మ్ లో వయొలెన్స్ అంటే ఏంటో చూపిస్తా” అంటూ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోని పోస్ట్ చేస్తూ ఒక సినీ అభిమాని “హైప్ తో నిద్ర పట్టట్లేదు. ప్లీజ్ ట్రైలర్ రిలీజ్ టైమ్ చెప్పండి” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ అండ్ అందులో వీడియో చూడగానే సందీప్ “ఈరోజు ప్రశాంతంగా పడుకోండి, అనిమల్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు మీరు అసలు పడుకోరు” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఒక్క ట్వీట్ తో అనిమల్ వైల్డ్ నెస్ ట్రైలర్ నుంచే షురూ అవుతుందని తెలుస్తోంది. మరి ఆ రేంజ్ ట్రైలర్ ని ఏ టైమ్ కి రిలీజ్ చేస్తారో చూడాలి.