టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మెగాటోర్నీలో తనదైన బ్రాండ్ క్రికెట్‌తో ఆకట్టుకున్న రోహిత్.. చివరకు ట్రోఫీని సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ చర్చలు మొదలు పెట్టిందట. ఈ క్రమంలో తన పేరును టీ20లకు పరిశీలించకపోయినా పర్లేదని సెలక్టర్లతో రోహిత్ చెప్పేశాడట. అయితే వన్డేలు, టెస్టులపైనే ఇకపై రోహిత్ ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తోంది. 2021లో భారత జట్టు పగ్గాలు అందుకున్న అతని ముందు రెండు లక్ష్యాలను బీసీసీఐ ఉంచింది. అవే 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్. ఈ సమయంలోనే రాహుల్ ద్రావిడ్‌ను కొత్త కోచ్‌గా కూడా నియమించింది.
Read Also: ED Rides: మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
ఇదిలా ఉంటే.. 2022 ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ చివరిసారిగా ఆడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఫైనల్ కు వెళ్లగా.. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ వరల్డ్ కప్ తర్వాత టీ20 లకు రోహిత్ ను సెలక్టర్లు పక్కన పెట్టేసారు. అప్పటి నుంచి హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు టీ20 మ్యాచ్ లు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో 2024 లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా.. ఇప్పుడు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంది. కాగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. 2024లో జరగబోయే టీ20 కెప్టెన్ గా బీసీసీఐ ఎవరిని బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.