ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. బాధితులకు రూ.7.11 కోట్ల పరిహారం పంపిణీ..
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో బోట్లు తగలడడంతో తీవ్ర నష్టం కలిగింది.. అయితే, బోట్ల యజమానులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేశారు మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. ఇక, ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోట్ల స్థానంలో లాంగ్ లైనర్లు సమకూర్చు కోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.. 75 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్సకారుల డీసెల్ బకాయిలు కూడా చెల్లిస్తాం. త్వరలో 4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయమని సీఎం ఆదేశించారని తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు.. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు. కలాశీలకు పది వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చెప్పారని.. ఇప్పుడు దాదాపు 400 మంది కలాశీలకు మేలు జరుగుతోందన్నారు. మరోవైపు, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో జీరో జట్టీ ఆధునీకరణకు ఆదేశాలు ఇచ్చారు.. ఇప్పుడు రాజకీయాలకు తావు ఇవ్వకండి అని విజ్ఞప్తి చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.
వీడు ఉపాధ్యాయుడేనా..? స్కూల్ నుంచి విద్యార్థిని కిడ్నాప్, తాళికట్టి అత్యాచారం..!
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.. విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉన్న అతడి కన్ను ఓ విద్యార్థినిపై పడింది.. 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు.. అంతేకాదు.. స్కూల్ నుంచి ఈ నెల 19వ తేదీన విద్యార్థినిని తన బైక్‌పై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లాడు.. అక్కడే ఆ బాలికకు తాళి కట్టి పెళ్లైందని చెప్పాడు.. అంతటితో ఆగకుండా.. తనలోని పశువును నిద్రలేపాడు.. తాళికట్టి పెళ్లి అయిపోయిందని చెప్పి.. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె సత్యనారాయణ వివరించారు.
స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్.. టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి
తిరుపతి స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా క్యాజువాల్టీ ముందే ఓ టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి చెందారు. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్ తన తండ్రి గోపీనాయక్ కు గుండెనొప్పి రావడంతో బుధవారం మధ్యాహ్నం ఆటోలో స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ సమయంలో అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లడానికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఆటోడ్రైవర్ సాయంతో లోపలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఆటోడ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని సెక్యూరిటీ వారిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.. తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని, సహకరించాలని చంద్రానాయక్ సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గోపీనాయక్ కి మరోసారి గుండెపోటు రావడంతో క్యాజువాలిటీ ముందే ప్రాణాలు విడిచారు.
విశ్వగురు అయితే.. మోడీ.. ఇజ్రాయిల్ యుద్దం ఆపాలికదా..?
యుద్ధం వ్యాపించకూడదు అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అక్కడితో ఆగిపోయాయి.. యుద్ధం ఆగకుండా.. అమాయకుల ప్రాణాలు ఎలా నిలబడతాయో మోడీ చెప్పాలి అని డిమాండ్ చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. యుద్ధం ఆపమని నరేంద్ర మోడీ.. ఇజ్రాయిల్‌కు ఎందుకు చెప్పలేదు.. విశ్వగురు అయితే ఇజ్రాయిల్ కు యుద్ధం ఆపమని చెప్పి ఉండాల్సింది కదా? ఎందుకు యుద్ధం ఆపలేకపోయారు? అని ప్రశ్నించారు. తీవ్ర వర్షలతో హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు పడిపోయాయి.. హిమాలయాలతో ఆటలాడుకోకూడదు.. హిమాలయాలతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. టూరిజం పేరుతో హిమాలయాలపై పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయిస్తుంది కేంద్రం అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు రాఘవులు.. భారతదేశంలో పిట్టలు అంటే చాలామందికి గౌరవం.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్ కు ధన్యవాదాలన్న ఆయన.. మేం పిట్టలమే.. కానీ, బీజేపీ లాగా రాబందుల పార్టీ కాదు అన్నారు. బీజేపీలో ఉందా సయోధ్య..? ఉంటే బండి సంజయ్ ను ఎందుకు మార్చారు..? అని ప్రశ్నించారు. బీజేపీ ది ఏదో వాళ్లు కడుక్కోటం మంచిది అంటూ ఘాటుగా బదులిచ్చారు రాఘవులు.. ఇక. ఎన్నికల్లో పొత్తులపై స్పందిస్తూ.. వైరుధ్యాలు ఉన్నా కలవడం ఒక ముందడుగు తప్ప మరోటి కాదు అన్నారు.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా అలయెన్స్ బలం తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒడంబడిక ఉంది.. మేం దానిని కాదని చెప్పం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.
గజ దొంగే.. దొంగా దొంగా అన్నట్టు టీడీపీ నేతల తీరు.. మండిపడ్డ మంత్రి
గజ దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుంది.. తెలుగు దేశం పార్టీ నేతలు దోపిడీ గురించి మాట్లాడుతుంటే అంటూ మండిపడ్డారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఆరోగ్యశ్రీ పై గత ప్రభుత్వం వెచ్చించింది రూ.5,177 కోట్లు, మా ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514 కోట్లు అని.. ఒక ఫ్రెషర్ చంద్రబాబు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని దుయ్యబట్టారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని ఆరోపించారు.. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో తెలుసా? అసలు అంటూ నిలదీశారు. ఫ్రెషర్స్ ని ఆర్థిక పరమైన అంశాల గురించి ముందు తెలుసుకోవాలి.. బ్యాంక్ లు మెగా సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని తెలిపారు మంత్రి బుగ్గన.. మెగా సంస్థకు ఎన్ని బకాయిలు ఉన్నాయి అని వివరాలు మాత్రమే బ్యాంకులకు ఇచ్చామన్న ఆయన.. నిర్మాణంలో ఉన్న పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి రూ.40 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.. ఈ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం రూ.40,000 కోట్లు పెండింగ్ బిల్లులకు కూడా గ్యారంటీ అడిగారా? అంటూ ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉంది.. యువతపై కవిత స్పీచ్
ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని.. ప్రశ్నించకపోతే ఏమీకాదని ఎం.ఎల్.సి. కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎమ్మెల్సీ కవిత ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే యుగం యువతదే అన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తి మంతమైందన్నారు. ఓటు వేయకపోతే అడిగే హక్కును కోల్పోతారని అన్నారు. పట్టణాల్లో తక్కువగా పోలింగ్ అవుతుందని.. గ్రామాల్లో ఓటింగ్ పెరుగుతుందని అన్నారు. ఎన్నికలు అంటే ఆషామాశిగా తిసుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు. ప్రశ్నించడం తెలంగాణ రక్తంలో ఉందని అన్నారు. ప్రశ్నించకపోతే ఏమీకాదని అన్నారు. ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుంచి విద్యార్థులు బయటకు రావాలని అన్నారు.
సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బహిరంగ లేఖ
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ కి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో.. దళిత వర్గాలను మభ్యపెట్టేందుకు మీరు ప్రయోగించిన అస్త్రం ‘దళితుడినే ముఖ్యమంత్రిని చేయడం’.. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలోనూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి’ అని ప్రకటించారు.. కానీ ఆ తర్వాత వివిధ వేదికల ద్వారా ఈమాటను పదే పదే చెప్పారు అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక, ‘కేసీఆర్ మాట చెబితే.. తల నరుక్కుంటాడు కానీ మాట తప్పను!’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన మీరు.. అధికారంలోకి రాగానే ఎందుకు మీ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తమాటలు చెప్పుకుని ప్రజలను మాయచేసే మీరు.. రాష్ట్రంలోని 20 శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర మీరు ఎలాచేయగలిగారు? అంటూ మండిపడ్డారు. ఇటువంటి మోసపూరిత ప్రతిజ్ఞలు చేసి.. ఇతర పార్టీలను తిప్పలు పెట్టానని మీకు మీరే సంబరపడ్డారు.. దీన్ని గొప్ప రాజకీయ చతురతగా మీ వాళ్లతో ప్రచారం చేయించుకున్నారు. తెలంగాణ దండోరా ఉద్యమాన్ని బలహీనం చేస్తూ.. దళితుల్లో లేనిపోని ఆశలు కల్పించిన మీ తీరు.. ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ రకమని తెలుసుకునేందుకు.. చాలా సమయం పట్టింది అని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.
బర్రెలక్క మేనిఫెస్టో విడుదల.. ప్రధాన అంశాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క సంచలనంగా మారుతోంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని.. అందుకే దృష్టి సారిస్తోందంటూ అప్పట్లో ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క వీడియో తీసింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఆ వీడియో ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తోందని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు విమర్శించారు. కాగా శిరీషకు నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు లభించింది. అప్పటి నుంచి శిరీషకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు ప్రజలు, యువత నుంచి మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా, ఆకట్టుకునే మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా బారెలక్క మరింత సంచలనంగా మారింది.
1. నిరుద్యోగం అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతారు. సరైన సమయంలో నోటిఫికేషన్‌లు పోస్ట్ చేయబడతాయి
2. పేదలకు ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తామన్నారు
3. ఆర్టికల్ 41 నిరుద్యోగులకు ప్రయోజనాలను అందిస్తుంది
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య మరియు వైద్య సంరక్షణకు మద్దతు
6. నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోర్సు – ఉచిత కోచింగ్
7. ఉన్నత విద్య కోసం యువతకు ఉచిత ఇవ్వడంతో పాటు అండగా ఉంటాను.
ఆధార్ తీసుకుని పదేళ్లయిందా.. ఫ్రీ అప్ డేట్ మరి కొన్ని రోజులే
ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఇంకా ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదా? కానీ ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది. 14 డిసెంబర్ 2023 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆధార్ పత్రాలను అప్‌డేట్ చేయడానికి డబ్బులు చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న తేదీ నుండి 10 సంవత్సరాలు నిండిన వారు తగిన పత్రాలను సమర్పించి, అందులో ఉన్న వివరాలను అప్‌డేట్ చేయాలని ఉడయ్ గతంలో సూచించింది. ఇకనుండి, ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకు ఒకసారి గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో వివరాలను అప్‌డేట్ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు CIDRలో అప్ డేట్ అవుతుందని, ఇది కచ్చితమైన సమాచారానికి దోహదపడుతుందని చెబుతున్నారు.
చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?
ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్‌జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. తద్వారా వాయిస్ ఇన్‌పుట్స్ అందించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ఈ వాయిస్ ఫీచర్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఉచితంగా లేదా పేమెంట్ చేయడం ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.. వినియోగదారులు తమ ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ఫోన్ ఐకాన్ కోసం సెర్చ్ చేయాలి. ఈ ఐకాన్‌పై ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ చాటింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీ అనుభవాన్ని గణనీయంగా మారుస్తుందని మాజీ ఓపెన్ఏఐ అధినేత వెల్లడించారు..
ఆసీస్- భారత్ మ్యాచ్ కి వరుణ గండం
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా విశాఖలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే ఛాన్స్ ఉండటంతో టాస్ ఆలస్యం అవుతుందని స్థానికులు అంటున్నారు. ఇక, వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోయినప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉందనే టాక్. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ సిరీస్‌లో యంగ్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్లు.. విశాఖలో జరిగే టీ20లో ఆసీస్‌ను ఓడించాలని టీమిండియా యంగ్ స్టార్ట్ పట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా సైతం కొందరు ముఖ్యమైన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది. వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టార్క్, హాజిల్‌వుడ్, మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక, ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉంటున్నారు.
సుమ కొడుకు సినిమా సాంగ్ ని లాంచ్ చేసిన మెగాస్టార్…
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘బబుల్ గమ్’. కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 29న రిలీజ్ కానున్న బబుల్ గమ్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి బబుల్ గమ్ సినిమా నుంచి ఒక సాంగ్ ని లాంచ్ చేసాడు. ఇజ్జత్ అంటూ సాగే సాంగ్ లో మంచి ఎనర్జీ ఉంది. ర్యాప్ సాంగ్ గా బయటకి వచ్చిన ఇజ్జత్ పాటలో రోషన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ సాంగ్ ని శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేయగా హరి లిరిక్స్ రాసి సాంగ్ పాడాడు. తెలంగాణ, హైదరాబాద్ యూత్ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ లో రోషన్ డాన్స్ కూడా చాలా బాగా చేసాడు. హుక్ స్టెప్ రీల్స్ లో వైరల్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా రోషన్ కి హీరోగా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
సూపర్ స్టార్ బర్త్ డేకి సరైన కమర్షియల్ సినిమా రీరిలీజ్…
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ గా జైలర్ సినిమా నిలిచింది, ఈ సినిమాతో 650 కోట్లు రాబట్టిన రజినీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ అమితాబ్ బచ్చన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజైన డిసెంబర్ 12న ఒక సూపర్ అప్డేట్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డిసెంబర్ 12న రిలీజయ్యే అవకాశం ఉంది. తలైవర్ 170 సినిమా నుంచి వచ్చే అప్డేట్ తో పాటు… రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న తలైవర్ 171 ప్రాజెక్ట్ నుంచి కూడా అఫీషియల్ అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అప్డేట్ బయటకి వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి లోకేష్ నుంచి జస్ట్ తలైవర్ 170 టైటిల్ బయటకి వచ్చినా చాలు హైప్ ఆకాశాన్ని తాకుతుంది. ఈ రెండు చాలవన్నట్లు రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా శివాజీ తెలుగులో రీరిలీజ్ అవుతోంది. శంకర్-రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా… సరైన కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, రజినీ మార్క్ హీరోయిజం… రెండూ పర్ఫెక్ట్ గా సెట్ అయిన శివాజీ సినిమా డిసెంబర్ 12న తెలుగులో రీరిలీజ్ అవనుంది.