భారత్-ఆస్ట్రేలియా మధ్య గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కేవలం 6 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆసీస్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 57 బంతుల్లో (123) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు…
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుపొందింది. కంగారులపై యువ ఆటగాళ్లు చెలరేగడంతో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.