ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో కేకేఆర్ అలవోకంగా విజయం సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ భారీ స్కోరు చేయకుండ ఉండేందుకు కేకేఆర్ బౌలర్లు శ్రమించడంతో పరుగులను కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించి…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో సూపర్ విక్టరీ సాధించిన ఆర్సీబీ.. మళ్లీ ప్లేఆఫ్ ఆశలను రేపింది. ఇప్పుడు అభిమానులందరి మదిలో ఇదే ప్రశ్న మెదులుతుంది. అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్-4 లో ఉండాలంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని దేశాలు సమయాత్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీని దక్కించుకునేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.