ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూకుడుగా మీదున్న ఎస్ఆర్హెచ్.. మరోసారి విజయం సాధించేందుకు బరిలోకి దిగుతుంది. ఇటు.. ఆర్సీబీ వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండటంతో.. ఈ మ్యాచ్ లో గెలిచి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు.…
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠపోరు నడిచింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. చివరకు ఢిల్లీ గెలుపొందింది. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ సూపర్ గా ఆడినప్పటికీ గుజరాత్ ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటింగ్ లో వృద్ధిమాన్ సాహా (39), గిల్ (6), సాయి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.