ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. కాగా.. తుది జట్టులో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దాంతో పాటు.. స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను రిజర్వ్‌లుగా చేర్చారు. అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్న ఫినిషర్ కి ప్లేయింగ్ 15 టీమ్‌లో చోటు దక్కకపోవడంపై... క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ…
బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్కస్ స్టోయినీస్ (62) పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో ముంబై తక్కువ రన్స్ చేసింది. ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. నేహల్ వద్వేరా, టిమ్ డేవిడ్ ఆచితూచి ఆడటంతో ఓ మోస్తారు స్కోరును చేయగలిగింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. మరోవైపు.. రెండు టీమ్ లు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.