ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఇంతకముందు మ్యాచ్ లో సన్ రైజర్స్ పై గెలిచి సీఎస్కే మంచి ఊపుమీదుంది. మరోవైపు.. సీఎస్కేకు తమ హోంగ్రౌండ్ కాబట్టి కలిసొచ్చే విషయం.. అటు పంజాబ్ కూడా ఈ మ్యాచ్ లో సీఎస్కే పై గెలువాలని పట్టుదలతో ఉంది.
Sundar Pichai: అతి త్వరలో బిలియనీర్ లిస్ట్ లోకి గూగుల్ అధినేత..
చెన్నై ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్.
పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్:
జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్.