2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దీని తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
జింబాబ్వే జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్‌లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు.
ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.
ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 183 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(66), రుతురాజ్(49)లు రాణించారు.
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.