ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రికెటర్లతో పాటు, మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్.. మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా దేవనాథన్‌పై కూడా ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదులో.. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్, అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి అనుమతించడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000ని ఉల్లంఘించిందని ఆరోపించారు.
CM Chandrababu: జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా..
కాగా.. ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌లో భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.. అయితే.. ఆ టోర్నీలో సాగిన తమ అనుభవాలను మాజీ క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో.. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రైనా తమ శరీరాలపై మ్యాచ్‌ల వల్ల కలిగే శారీరక నష్టాన్ని చూపించడానికి కుంటుకుంటూ.. వీపును పట్టుకుని కనిపించారు. శరీరంలోని ప్రతి భాగం నొప్పులుగా ఉందని వీడియోలో చూపించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. దివ్యాంగులను ఎగతాలి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Bengaluru traffic: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెడ్‌సిగ్నల్ దాటినా నో ప్రోబ్లం!
ఈ వివాదంపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ, “ఇటీవల సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది తమ ఉద్దేశ్యం కాదని, ఈ మేరకు ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులను సందేహాలను నివృత్తి చేయగలుచుకున్నానని తెలిపాడు. ప్రతి వ్యక్తిని, సమాజాన్ని తాము గౌరవిస్తామని, 15 రోజుల పాటు నిరంతరాయంగా క్రికెట్ ఆడడం వల్ల శరీరాలు అలసిపోయానని ప్రతిబింబించడమే వీడియో ఉద్దేశమని చెప్పాడు.