రాబోయే శ్రీలంక టూర్‌లో మెన్ ఇన్ బ్లూ టీమ్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు అభిషేక్ శర్మలను మినహాయించడంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నలు లేవనెత్తాడు. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు జులై 27 నుంచి శ్రీలంకలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) గురువారం రెండు ఫార్మాట్‌ల కోసం జట్టులను ప్రకటించింది. ప్రపంచ టీ20 ఫార్మాట నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. ఈ సందర్భంగా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై వ్యంగంగా ప్రశ్న సంధించాడు. “యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు శ్రీలంక కోసం భారత జట్టులో ఎందుకు భాగం కాలేదో అర్థం చేసుకోవడం కష్టం” అని హర్భజన్ ఎక్స్ లో రాశాడు.
READ MORE: Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్.. అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు
టీ20 జట్టులో… అభిషేక్ శర్మను తప్పించడం అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అతను ఇటీవల జింబాబ్వేపై అరంగేట్రం చేసాడు. అతని రెండవ మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. వన్డే జట్టులోనూ చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌లో భాగమైన చాహల్ కూడా శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. మరోవైపు.. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ 20 జట్టులో మాత్రమే పేరు పొందాడు. ప్రమాదం తరువాత టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులోకి తిరిగి వచ్చిన రిషబ్ పంత్ కు టీ20 టీమ్ లో చోటుదక్కింది.
READ MORE:Rain Alert: ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం.. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్
భారత టీ20, వన్డే జట్లు ఇవే…
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ , రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సింగ్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ , రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.