IND vs SL: చెలరేగిన భారత బ్యాటర్లు.. శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
- చెలరేగిన భారత బ్యాటర్లు
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL: పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది.
Read Also: Aditya Birla Group: రూ.5000 కోట్ల ప్రణాళిక..రిలయన్స్-టాటాలకు ఆదిత్య బిర్లా గట్టి పోటీ?
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
యశస్వి, శుభ్‌మన్‌ల అవుట్ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించేందుకు కృషి చేశాడు. వెనువెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత కూడా సూర్యకుమార్, పంత్ పరుగుల వేగాన్ని ఆపలేదు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా సూర్యకుమార్‌కి ఇదే తొలి టీ20 హాఫ్ సెంచరీ. ఈ విధంగా సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ దక్కిన వెంటనే.. ఇక ఆగేది లేదని తన వైఖరిని చాటుకున్నాడు. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?