భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు మహి, తల అని పిలుచుకుంటారు. ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో 'తల ఫర్ ఎ రీజన్'తో ట్రెండ్ అయ్యాడు. ఇందులో మహి అభిమానులది పెద్ద పాత్ర. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ఏదైనా జరిగినప్పుడు సోషల్ మీడియాలో డిఫెన్స్ చేయడం అభిమానుల ప్రేమ అని చెప్పుకొచ్చారు.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి భారత్ 161 పరుగులు చేసింది. భారత్ ముందు 162 పరుగుల ఫైటింగ్ టార్గెట్ ను ముందుంచారు.
ఇండియా-శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, భారత్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లూ తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.
'టర్బనేటర్'గా ప్రసిద్ధి చెందిన మాజీ భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశాడు.
రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తన కెరీర్లో తొలి కాంట్రాక్ట్‌ను అందుకున్నాడు. అతను మహారాజా ట్రోఫీ KSCA T20 లీగ్‌లో ఈ కాంట్రాక్ట్‌ను పొందాడు. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన మైసూరు వారియర్స్ సమిత్ ద్రవిడ్‌ను రూ.50 వేలకు కొనుగోలు చేసింది.
రాబోయే శ్రీలంక టూర్లో మెన్ ఇన్ బ్లూ టీమ్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు అభిషేక్ శర్మలను మినహాయించడంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నలు లేవనెత్తాడు.