పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్.. క్రీడల్లో ఉండే చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ, భరతనాట్యం.. స్కేటింగ్ నేర్చుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది.
పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ కోసం భారత్ లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు.
టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయరు నికోలస్ పూరన్ నిలిచాడు. అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్‌లను వెనక్కి నెట్టి పూరన్ మూడో స్థానానికి ఎగబాకాడు.
16 మంది సభ్యులలో 15 మంది అతనికి మద్దతు ఇవ్వడంతో జైషా తదుపరి ఐసీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐసీసీలో చేరితే అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమిస్తారనే దానిపై స్పష్టత లేదు. అధికారిక నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ కాబట్టి.. జైషా నిర్ణయం తీసుకోవడానికి 96 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాగా.. ఐసీసీ కొత్త చైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే స్కోరును చేస్తే.. ఆ మ్యాచ్ టై అవుతుంది. మళ్లీ తిరిగి సూపర్ ఓవర్ పెడుతారు. అలా.. ఒకే మ్యాచ్‌లో మూడుసార్లు టై అయింది. ఇంతకీ ఎక్కడా.. ఏ మ్యాచ్ అనుకుంటున్నారా..?. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 17వ మ్యాచ్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హుబ్లీ టైగర్స్…
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు నమోదైంది.
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియన్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గాయం తర్వాత బుమ్రా తిరిగి మైదానంలోకి వచ్చిన తీరు అభినందనీయమని పాంటింగ్ అన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుపై ప్రభావం చూపి ఆటగాళ్లను ఎలా తయారో చేశారో చెప్పాడు. ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నాడు.