భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్‌లో ఫిట్‌గా ఉన్న క్రికెటర్ పేరును వెల్లడించాడు. వాస్తవానికి ఇండియా టీమ్ లో తానే ఫిట్ ప్లేయర్ అని బుమ్రా అన్నాడు.
బాబర్ ఆజం వర్సెస్ రోహిత్ శర్మ మధ్య ఎవరు మంచి కెప్టెన్ అనే ప్రశ్నపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పందించాడు . వీరిద్దరిలో యూనిస్ ఖాన్ మంచి కెప్టెన్‌ని ఎంచుకున్నాడు. టెలిగ్రాఫ్‌తో యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. “బాబర్ రోహిత్ ఇద్దరూ తమ జట్టుకు గొప్ప ఆటగాళ్లు. కానీ కెప్టెన్‌గా, రోహిత్ బాబర్‌ను అధిగమించాడు. రోహిత్‌కు బాబర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇది కాకుండా.. హిట్‌మ్యాన్ స్వయంగా గొప్ప కెప్టెన్‌కి శిక్షణ ఇచ్చాడు. నేను…
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్‌సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
అత్యధిక సిక్సర్లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కేవలం ఐదు సిక్సులు కొడితే.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అవతరిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.
పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్‌లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.
దులీప్ ట్రోఫీలో ఇండియా 'D' పై ఇండియా 'C' ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా 'డి' జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
శుక్రవారం స్కాట్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. శతకం సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ రికార్డు సృష్టించాడు. ఈరోజు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు.
ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు.