అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లియామ్ బ్యాట్, బాల్‌తో అదరగొట్టాడు. లివింగ్‌స్టోన్ రెండు మ్యాచ్‌ల్లో 124 పరుగులు చేసి ఐదు వికెట్లు తీశాడు.
Read Also: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు
ఒక మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ రెండో టీ20లో 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండు మ్యాచ్‌లలో అతను అత్యుత్తము ప్రదర్శన చూపించడంతో.. లియామ్ ఏడు స్థానాలు ఎగబాకి ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ దూసుకొచ్చాడు. అంతకుముందు.. మొదటి స్థానంలో మార్కస్ స్టైనిస్ ఉండగా.. అతను రెండు స్థానాలు కోల్పోయాడు.
Read Also: Kumari Aunty : ముఖ్యమంత్రి సహాయనిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే..!
భారత ఆల్‌రౌండర్లలో టాప్-10లో హార్దిక్ పాండ్యా ఏకైక ఆటగాడిగా ఉన్నాడు. హార్దిక్ 199 పాయింట్లతో ఏడో స్థానంలో, అక్షర్ పేటల్ 149 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జోస్ ఇంగ్లీష్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 13 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే.. ట్రావిస్ హెడ్ స్థానం అలానే ఉండగా.. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.