భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తు గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోలేనని అనుకున్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అశ్విన్ చెప్పాడు. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో విమల్ కుమార్‌తో సంభాషణ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. “నా మనస్సులో అలాంటిదేమీ లేదు. ఇప్పుడు నేను ఒక్క రోజు గురించి ఆలోచిస్తున్నాను. నేను గత 3-4 సంవత్సరాలుగా జట్టులో కష్టపడి పనిచేశాను. నేను ఇంకా పదవీ విరమణ గురించి నిర్ణయించుకోలేదు, కానీ నేను మెరుగుపడనని భావించిన రోజు, పదవీ విరమణ చేస్తాను.” అని చెప్పుకొచ్చాడు.
Read Also: Hyderabad Mayor: మెట్రోలో ప్రయాణించిన మేయర్.. సేవలు, సౌకర్యాలపై ఆరా..
ఐసీసీ (ICC) టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమయ్యే భారత్‌కు.. రాబోయే ఐదు టెస్టుల హోమ్ సిరీస్‌లో అశ్విన్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. 100 టెస్టు మ్యాచ్‌ల్లో 516 వికెట్లు తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతని కంటే ముందు 619 వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ఉన్నాడు.
Read Also: Minister Narayana: చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం..
అశ్విన్ మాట్లాడుతూ.. “నేను నా కోసం ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అనిల్ భాయ్ రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నాను, కానీ నేను ప్రతిరోజూ సంతోషంగా జీవిస్తున్నాను. లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా ఆటపై నా ప్రేమను కోల్పోవడం నాకు ఇష్టం లేదు” అని అశ్విన్ పేర్కొన్నాడు.