భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్‌లో ఫిట్‌గా ఉన్న క్రికెటర్ పేరును వెల్లడించాడు. వాస్తవానికి ఇండియా టీమ్ లో తానే ఫిట్ ప్లేయర్ అని బుమ్రా అన్నాడు. సోషల్ మీడియాలో బుమ్రా చేసిన ఈ ప్రకటన అభిమానులను ఉత్సాహపరిచింది. ఒక ఈవెంట్‌లో బుమ్రాను టీమ్ ఇండియా యొక్క ఫిటెస్ట్ ప్లేయర్ గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి భారత బౌలర్ ఫన్నీగా స్పందించాడు. బుమ్రా బదులిస్తూ.. “మీకు ఏం సమాధానం కావాలో నాకు తెలుసు. ఫిటెస్ట్ ప్లేయర్ లలో నాపేరు చెప్పుకునేందుకు ఇష్టపడతాను. నేను ఫాస్ట్ బౌలర్‌ని, నేను చాలా మ్యాచ్ లు ఆడాను. ఫాస్ట్ బౌలర్‌గా ఉంటూ.. ఈ వేసవిలో ఆడటానికి చాలా శక్తి అవసరం. నేను ఎప్పుడూ బౌలర్ల కోసం ఎదురుచూస్తాను. కాబట్టి నేను ఫిట్ క్రికెటర్‌గా ఫాస్ట్ బౌలర్ పేరు తీసుకుంటాను.” అని బుమ్రా ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Ganesh Immersion: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు..!
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించేందుకు బుమ్రా చేరువలో ఉన్నాడు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్‌లో బుమ్రా ప్రత్యేక రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 195 మ్యాచ్‌లు ఆడి 226 ఇన్నింగ్స్‌లలో 397 పరుగులు సాధించాడు. బుమ్రా మూడు వికెట్లు తీయడంలో సఫలమైతే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేస్తాడు. ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా, జవగల్ శ్రీనాథ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 400 వికెట్లకు పైగా తీశారు.
"I know the answer you're searching for" ????
This much arrogance after 1st good performance in ICC Knockouts?? This choker choked in every tournament till 2023Chumrah since debut, has missed more than 50 matches due to injury but i'M FiTtEstpic.twitter.com/miKKoeiWwH
— Gaurav (@Melbourne__82) September 13, 2024