టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీ బ్లాక్‌లో ఉన్న రాబి బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ.. మద్దతుగా నినాదాలు చేశాడని, దాంతో స్థానిక భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై అతనితో వాగ్వాదానికి దిగారని, లంచ్ బ్రేక్…
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.
రేపు బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవవన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఎవరిని చేర్చుకున్నాడో దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తు గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోవాలనే కోరిక లేనప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అశ్విన్ చెప్పాడు. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని అశ్విన్ అన్నాడు.
భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్లో ఫిట్‌గా ఉన్న క్రికెటర్ పేరును వెల్లడించాడు. వాస్తవానికి ఇండియా టీమ్ లో తానే ఫిట్ ప్లేయర్ అని బుమ్రా అన్నాడు.