ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్‌సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఐపీఎల్ లోకి 2022లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ నిర్వహిస్తున్నాడు. టీమ్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే ప్లేఆఫ్స్ కు జట్టును చేర్చి.. తనలోని కెప్టెన్సీగా సత్తా చాటాడు. అయితే, దీనికి ముందు అతను పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించాడు. అయితే, 2022లో ఎల్‌ఎస్‌జీలో కెప్టెన్‌గా చేరాడు. రెండు సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ.. అతను బహుశా ఈ ఫ్రాంచైజీతో సంతోషంగా లేడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కేఎల్ రాహుల్ అశ్వీన్ యూట్యాబ్ ఛానల్ లో ప్రకటనతో అర్థం అవుతుంది.
READ MORE: KL Rahul: ఆర్‌సీబీలోకి ప్రవేశంపై స్పందించిన కేఎల్ రాహుల్.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా.. వాస్తవానికి, ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఒక వీడియోలో.. ఓ వ్యక్తి కేఎల్ రాహుల్ తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఆర్‌సీబీ జట్టులో కేఎల్ రాహుల్‌ను చూడాలనుకుంటున్నట్లు చెప్తాడు. ఎందుకంటే తాను ఆర్‌సీబీకి పెద్ద అభిమానిని అని తెలిపాడు. దీనిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్పందించాడు. ‘ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను.’ అని రాహుల్ సమధానమిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
ముదిరిన వివాదం
అయితే, దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో రాహుల్ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోయింది. అప్పుడు గ్రౌండ్‌లోనే రాహుల్‌పై సంజీవ్ అరిచేశాడు. రాహుల్ ఏదో చెబుతున్న వినకుండా అలాగే సంజీవ్ తిట్టాడు. అప్పుడే లక్నో టీమ్‌కు రాహుల్ వీడ్కోలు చెబుతుడానే క్రికెట్ ఫ్యాన్స్‌లో అనుమానం మొదలైంది.
READ MORE: Mathuvadalara2 : మత్తు వదలరా – 2 చూసిన ‘మెగా – సూపర్’ స్టార్స్ ఏమన్నారంటే..?
ఆర్సీబీతో ఎంట్రీ..
ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అది కూడా 2025 ఐపీఎల్ సీజన్ కంటే ముందుగానే వేరే జట్టులోకి మారనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ తనను పరిచయం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి మారాలని చూస్తున్నట్లు సమాచారం. 2013లో కేఎల్ రాహుల్‌ను ఆర్సీబీ పరిచయం చేసింది. 2016లో కూడా ఆర్సీబీ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చూపాడు.
I'm happy that KL Rahul knows about the rumours that are going around for him & RCB.
Please boss change your IPL team! 🙏❤️ pic.twitter.com/Os06Uj39gQ
— Kunal Yadav (@Kunal_KLR) September 14, 2024