రేపు బంగ్లాదేశ్‌తో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవవన్‌ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఎవరిని చేర్చుకున్నాడో దినేష్ కార్తీక్ వెల్లడించాడు. అలాగే.. తన అభిమానులను కూడా అడిగి తెలుసుకున్నాడు. దినేష్ కార్తీక్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఈ జట్టులోకి తీసుకున్నాడు. దినేష్ కార్తీక్ ఎంపిక చేసిన జట్టుతోనే భారత జట్టు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందనే సంకేతాలు అందుతున్నాయి.
Read Also: Parrot Surgery: చిలుకకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన పశు వైద్యులు..
దినేష్ కార్తీక్ తన జట్టులో 6 బ్యాట్స్‌మెన్, ఒక ఆల్ రౌండర్, నలుగురు బౌలర్లు ఉన్నారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ను సెలక్ట్ చేసుకోగా, ఐదో నంబర్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌ని సెలక్ట్ చేశాడు. అలాగే బౌలింగ్‌లో.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్‌లను జట్టులోకి తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను స్పిన్నర్లుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చాడు. ఓపెనర్ నుండి నంబర్ 4 నెంబర్ బ్యాటర్ వరకు చెప్పలేదు. ఎందుకంటే ఓపెనింగ్ లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ ఆడుతారని అందరికీ తెలుసు.. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
Read Also: Viral Video: టిక్కెట్టు లేకుండా రైలులో జర్నీ.. అడిగినందుకు టీటీఈపై దాడి
దినేష్ కార్తీక్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.