corona cases in india: దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే కాస్త తక్కువగానే కేసులు సంఖ్య నమోదు అవుతోంది. రెండు వారాల క్రితం వరకు దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో డైలీ కేసులు 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతున్నాయి. కోవిడ్ రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 'ఆజాదికా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో 'మోదీ@2.0' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
COVID cases in india: దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. వరసగా మూడో రోజు కూడా కేసులు 20 వేలను దాటాయి. తాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించి వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,408 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20,958 మంది మహమ్మారి నుంచి కోలుగకోగా.. 54 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,384కు…
COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గ
COVID 19 Updates: ఇండియాలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు 20 వేలకు పైగా రోజూవారీ కేసులు వచ్చాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి 20 వేల కన్నా దిగువనే కేసుల సంఖ్య నమోదు అవుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువ అయింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్…
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 20,279 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 18,143 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక రోజులో 36 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే .. ఇప్పటి వరకు దేశంలో 4,38,88,775 కరోనా కేసులు నమోదు అవ్వగా.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణి విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్‌లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్‌గేట్స్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.