Covid-19: కొవిడ్ కట్టడిపై పలు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. అర్హత గల అందరికీ టీకాను వేగంగా అందించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలన్నారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని.. కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
గడిచిన 24గంటల్లో 19,406 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 49 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 19,928 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ కేసులను ముందస్తుగా గుర్తించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కొవిడ్ ప్రోటోకాల్ ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కొవిడ్ క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!