COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 44 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,216 మంది మహమ్మారిని జయించారు.
దేశంలో కోవిడ్ మొదలైన రెండున్నర ఏళ్లలో 4,39,59,321 మందికి కరోనా సోకింది. వీరిలో ఇప్పటి వరకు 5,26,211 మంది చనిపోయారు. 4,32,86,787 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల శాతం 1.20గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేస్ లోడ్ 1,297 కేసులకు పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.71గా ఉంది.
Read Also: Mamata Banerjee: మంత్రి పార్థ ఛటర్జీ కేసు.. మీడియాపై దీదీ ఆగ్రహం
కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో చోటు చేసుకున్న మరణాల్లో కూడా ఈ రాష్ట్రాల నుంచే ఎక్కవ మంది చనిపోయారు. కేరళలో 12 మంది, మహారాష్ట్రలో 8 మంది, బెంగాల్లో 5 మంది, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడి మరణించారు.