Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. అయితే ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.
COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది.
Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే…
Covid 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,111 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
Booster Dose: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్‌కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్‌రావు…
Covid Vaccination Improves Efficacy Of Cancer Treatment, Says Study: గత మూడేళ్లుగా కరోనా వైరస్ పేరు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. కోట్ల సంఖ్యలో ప్రజలకు కరోనా సోకింది. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు…
Corona Cases In India: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక నెల క్రితం వరకు సగటున 15 వేలకు పైగా నమోదుతూ వచ్చిన రోజూవారీ కరోనా కేసులు ప్రస్తుతం 5 వేల దిగువన నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,043 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 4,676 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు
కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్, బిల్‌గేట్ ఫౌండేషన్‌పై వెయ్యి కోట్ల దావా చేశారు ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ లునావత్. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తన కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బాంబే హైకోర్టు సీరం సంస్థతో పాటు బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అటు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు 100…
Corona Cases In India: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 9,436 కేసులు నమోదు అయ్యాయి. శనివారం నమోదైన కేసుల కన్నా 820 కేసులు తగ్గాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు దిగువకు వచ్చింది.…
Corona Cases In India: ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు 15-20 వేల మధ్య నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కేసుల సంఖ్య 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతోంది. దీంతో పాటలు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగివస్తోంది. రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో…