COVID 19 Updates: ఇండియాలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు 20 వేలకు పైగా రోజూవారీ కేసులు వచ్చాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి 20 వేల కన్నా దిగువనే కేసుల సంఖ్య నమోదు అవుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువ అయింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో రోజూవారీ కేసులు 18,313 నమోదు అయ్యాయి. 20,742 మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. అయితే గడిచిన ఒక్క రోజులో మరణాల సంఖ్య ఎక్కువైంది.. ఏకంగా 57 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,45,026 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజూవారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.31 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి భారత్ లోకి ఎంటర్ అయిన రెండున్నర ఏళ్లలో ఇప్పటి వరకు 4,39,38,764 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 4,32,67,571 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు..5,26,167 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.47గా ఉంది. డెత్ రేట్ 1.20 శాతంగా ఉంది.
దేశంలో ప్రస్తుతం 2,02,79,61,722 కోట్ల డోసులు కరోనా వ్యాక్సిన్ ను అర్హులైన వారికి అందించారు. గడిచిన ఒక్క రోజులో 27,37,235 మందికి టీకాలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 57,58,81,194 మందికి కరోనా సోకగా..64,04,942 మంది మరణించారు. ప్రస్తుతం జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.