COVID cases in india: దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. వరసగా మూడో రోజు కూడా కేసులు 20 వేలను దాటాయి. తాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించి వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,408 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20,958 మంది మహమ్మారి నుంచి కోలుగకోగా.. 54 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,384కు చేరింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేట్ 5.05 శాతంగా నమోదు అయింది.
దేశంలో రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 2 వేలకు పైగా కేసులు నమోదు అవుతుంటే..కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా మిగతా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యిని దాటింది. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో దేశంలోని అర్హులైన ప్రజలకు 200 కోట్ల డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది. తాజాగా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 203.94 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో 33,87,173 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
Read Also: MiG Crashes: వాయుసేకు మిగ్-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!
ఇదిలా ఉంటే గత రెండున్నరేళ్లుగా దేశంలో 4,40,00,138 మంది కరోనా బారిన పడ్డారు. 4,33,30,442 మంది మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. 5,26,312 మంది కోవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.33 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.20 శాతంగా, రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది.